E-Paper
Advertisement

Kia EV2 Electric SUV: కియా నుంచి అతి చిన్న ఎలక్ట్రిక్ SUV, రేంజ్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వుద్ది!

Kia EV2 Electric SUV: కియా నుంచి అతి చిన్న ఎలక్ట్రిక్ SUV, రేంజ్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వుద్ది!
Advertisement

New Kia EV2 Compact Electric SUV: కియా తన కొత్త EV2 ఎలక్ట్రిక్ SUVని భారతీయ మార్కెట్ లోకి విడుదల చేసింది. దేశంలోనే అతి చిన్న ఎలక్ట్రిక్ SUVగా దీనిని అభివర్ణించింది. ఈ SUV, కియా గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలో అత్యంత కాంపాక్ట్, సౌకర్యవంతమైన మోడల్‌ గా రూపొందించబడింది. ముఖ్యంగా, సిటీల్లో ఎలక్ట్రిక్ మొబిలిటీని సాధ్యమైనంత ఎక్కువ మందికి అందించాలనే లక్ష్యంతో ఈ SUV తయారు చేసినట్లు కంపెనీ వెల్లడించింది.

EV2 ధర ఎంత అంటే?

EV2, కియా అధునాతన E-GMP ప్లాట్‌ఫారమ్పై తయారుచేయబడింది. దీని ధర రూ. 23–24 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. SUV రూపం కాంపాక్ట్ పెట్టె ఆకారంలో ఉండి, ముందు భాగంలో కియా కొత్త  టైగర్ ఫేస్ డిజైన్ ను కలిగి ఉంటుంది. LED హెడ్‌ లైట్స్, స్టైలిష్ ఫ్రంట్ బంపర్‌ ను కలిగి ఉంటుంది. పక్క భాగంలో బాడీ క్లాడింగ్ వెనుక వైపుకు విస్తరించి ఉంటుంది. వెనుక టెయిల్‌ లైట్లు, సన్నని వెనుక విండో, రూఫ్ స్పాయిలర్ SUVకి ఆధునిక, మినిమలిస్టిక్ లుక్ ఇస్తాయి.

ఇంటీరియర్ ఎలా ఉంటుందంటే?

Advertisement

ఈ కారు ఇంటీరియర్ ప్యూచరిస్టిక్ స్టైల్ లో ఉంటుంది. టెక్నాలజీతో నిండి ఉంటుంది. ఇందులో ట్రిపుల్ స్క్రీన్ సెటప్ ఉంటుంది. 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 5.3 అంగుళాల HVAC కంట్రోల్ ప్యానెల్, 12.3-అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్ ఉంటుంది. రెండు స్పోక్ లతో ఉన్న స్టీరింగ్ వీల్, సింపుల్‌ గా ఉండి ప్రీమియం ఫీల్ ఇస్తుంది.

EV2 ఫీచర్లు గురించి..  

ఫీచర్లు పరంగా, EV2లో హార్మన్ కార్డాన్ ఆడియో, డిజిటల్ కీ 2.0, V2L , V2G, లాంటి అధునాతన ఛార్జింగ్ టెక్నాలజీలు ఉన్నాయి. ఇది 4 సీటర్, 5 సీటర్ వెర్షన్లలో లభిస్తుంది. 4 సీటర్ వెర్షన్‌ లో వెనుక సీట్లు స్లైడ్, రిక్లైన్ చేయవచ్చు, 403 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగి ఉంటుంది. 5 సీటర్ వెర్షన్‌ లో 362 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. రెండు వేరియంట్లలో 15 లీటర్ల ఫ్రంట్ స్టోరేజ్ కూడా ఉంటుంది.

రెండు బ్యాటరీ ఆప్షన్లతో EV2

Advertisement

EV2 రెండు బ్యాటరీ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. బేస్ మోడల్‌లో 42.2 kWh LFP బ్యాటరీతో ఉంటుంది. ఒకే ఛార్జ్ తో ఈ కారు సుమారు 317 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. లాంగ్ రేంజ్ వెర్షన్‌ లో 61.0 kWh NMC బ్యాటరీ ఉంది. ఇది ఒకే పూర్తి ఛార్జ్‌లో 448 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. రెండు వెర్షన్‌లు DC ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తాయి, 10% నుంచి 80% వరకు ఛార్జ్ కేవలం 30 నిమిషాల లోపే పూర్తి అవుతుంది. ఇక EV2 స్టాండర్డ్ వెర్షన్ 2026 మొదటి త్రైమాసికంలో ఉత్పత్తికానుంది. లాంగ్ రేంజ్, GT లైన్ వెర్షన్‌లను జూన్ 2026లో విడుదల చేయాలని భావిస్తోంది. భారత్ లో దీని విడుదల గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Read Also: కూలెంట్ తగ్గి ఏసీ పని చేయట్లేదా? సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×