// // Snake-Killing Bird: పాములతో కబడ్డీ ఆడే బ్యూటీఫుల్ బర్డ్.. కంటికి చిక్కితే ఖతమే! -->
E-Paper
Advertisement

పాములతో కబడ్డీ ఆడే బ్యూటీఫుల్ బర్డ్.. కంటికి చిక్కితే ఖతమే!

పాములతో కబడ్డీ ఆడే బ్యూటీఫుల్ బర్డ్.. కంటికి చిక్కితే ఖతమే!
Advertisement

Amazing Facts About Secretary Bird: ఆ బర్డ్ చూడ్డానికి అందంగా ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ ఈకలు, కళ్ల నుంచి ముక్కు వరకు ఆరెంజ్ కలర్ లుక్, బలమైన శరీరంతో ఆకట్టుకుంటుంది. కానీ, ఈ పక్షికి అత్యంత ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా పాములను వేటాడే విధానం చూసినవారికి ఆశ్చర్యం కలిగిస్తుంది. అదే.. ఆఫ్రికా గడ్డి భూముల్లో ఎక్కువగా కనిపించే సెక్రటరీ బర్డ్. పొడవాటి కాళ్లతో పాములను ఇట్టే చంపేస్తుంది. పాములను తనను చూసి పారిపోకుండా, వాటిని మిల్లీ సెకెన్ల వ్యవధిలోనే ప్రాణాలు తీసేస్తుంది.

ఎత్తైన పక్షిగా గుర్తింపు..

ఈ పక్షి దాదాపు 1.3 మీటర్ల ఎత్తు ఉంటుంది. కొంగలా పొడవాటి కాళ్లు, డేగలా ముఖం కలిగి ఉండటంతో ఇది చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఎక్కువ సమయం నేల మీదే తిరుగుతూ వేటాడుతుంది. అవసరమైతే ఎగరగలిగినా, సాధారణంగా కాలినడకనే జీవిస్తుంది.

ఆసక్తికరంగా వేటాడే విధానం

Advertisement

సెక్రటరీ బర్డ్ వేటాడే స్టైల్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పామును చూసిన వెంటనే దాని తలపై వేగంగా, బలంగా తన్నుతుంది. ఈ కిక్ పవర్ ఫుల్ గా ఉండి, కేవలం కొన్ని మిల్లీ సెకన్లలోనే పాము వెన్నెముక విరిగేలా చేస్తుంది. పాము దాడి చేయకుండా ఉండేందుకు రెక్కలను విప్పి దృష్టి మరల్చుతుంది. కాళ్లపై ఉండే గట్టిపొర పాము కాటుకు రక్షణగా పని ఉంటుంది.  పాములే కాకుండా ఈ పక్షి చిన్న క్షీరదాలు, కీటకాలు, బల్లులను కూడా తింటుంది.

జీవితాంతం కలిసే ఉంటాయి!

ఈ పక్షులు మగ, ఆడ పక్షితో ఒకసారి జత కట్టిన తర్వాత జీవితాంతం కలిసి ఉంటాయి. సాధారణంగా ఆకాసియా చెట్లపై గూళ్లు కడతాయి. ఒక జంటకు దాదాపు 50 కిలోమీటర్ల వరకు పరిధి ఉంటుంది. ఈ పక్షి అడవిలో 10 నుంచి 15 సంవత్సరాలు జీవిస్తుంది. కొన్ని 19 సంవత్సరాల వరకు బతుకుతాయి. ఆడ పక్షి గుడ్లు పెట్టిన తర్వాత సుమారు 45 రోజులు వాటిని పొదిగి పిల్లలను చేస్తుంది. ఈ పక్షి గుడ్లు సాధారణంగా నీలం లేదంటే ఆకుపచ్చ రంగులో ఉంటాయి.

ఈ పక్షులకు ఆ పేరు ఎలా వచ్చిందంటే?

Advertisement

సెక్రటరీ బర్డ్ అనే పేరు ఎలా వచ్చిందో కచ్చితంగా తెలియదు. అయితే, పాతకాలంలో లాయర్ల దగ్గర పనిచేసే సెక్రటరీలు ధరించే దుస్తులను పోలి ఉండటంతో ఆ పేరు వచ్చిందని ఒక అభిప్రాయం ఉంది. మరోవైపు అరబిక్ భాషలో  వేటాడే పక్షి  అనే అర్థంతో కూడా దీనిని పిలుస్తారు.

తగ్గిపోతున్న సెక్రటరీ బర్డ్స్ సంఖ్య

ప్రస్తుతం ఈ పక్షుల నివాస ప్రాంతాలు తగ్గిపోవడం వల్ల వీటి సంఖ్య తగ్గుతోంది. అయినా, కూడా ప్రకృతిలో అత్యంత తెలివైన, ధైర్యమైన వేటాడే పక్షులుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. పాములతో పోరాడే విధానం చూస్తే నిజంగానే దీనిని పాముల పాలిట యమ ధర్మరాజుగా చెప్పుకోవచ్చు.

Read Also: ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ ప్లేసెస్.. అడుగు పెట్టారో ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే!

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×