// // Anthropic Claude Mythos Preview: ఆంత్రోపిక్ కొత్త AI మోడల్.. బయటకు వస్తే విధ్వంసమే.. సాఫ్ట్‌వేర్ వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం!. -->
E-Paper
Advertisement

ఆంత్రోపిక్ కొత్త AI మోడల్.. బయటకు వస్తే విధ్వంసమే.. సాఫ్ట్‌వేర్ వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం!

ఆంత్రోపిక్ కొత్త AI మోడల్.. బయటకు వస్తే విధ్వంసమే.. సాఫ్ట్‌వేర్ వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం!
Advertisement

Anthropic Claude Mythos Preview: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో అగ్రగామి సంస్థ అయిన ఆంత్రోపిక్, టెక్నాలజీ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసే అత్యంత శక్తివంతమైన మోడల్ Claude Mythos Preview గురించి కీలక వివరాలను వెల్లడించింది. ఈ మోడల్ ఎంతటి సామర్థ్యాన్ని కలిగి ఉందంటే, ఇది సృష్టించగల నష్టాన్ని ఊహించి సంస్థ దీనిని బహిరంగంగా విడుదల చేయడానికి నిరాకరించింది. కేవలం కోడింగ్‌పై శిక్షణ ఇచ్చినప్పటికీ, ఇది అనూహ్యంగా సైబర్ సెక్యూరిటీ రంగంలో ప్రొఫెషనల్ హ్యూమన్ హ్యాకర్ల స్థాయిని మించిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఆంత్రోపిక్ ప్రయోగాల్లో ఈ ఏఐ మోడల్ ఒక ప్రొఫెషనల్ సెక్యూరిటీ రీసెర్చర్ లాగా ఆలోచించగలదని తేలింది. సాఫ్ట్‌వేర్ కోడ్‌లోని లోపాలను గుర్తించడంలో ఇది మనుషుల కంటే వేగంగా పనిచేస్తోంది. దీనికి ఉన్న మరొక సామర్థ్యం ఏమిటంటే, విడివిడిగా పెద్దగా ప్రమాదం లేని 4 లేదా 5 చిన్న లోపాలను ఒక క్రమపద్ధతిలో జోడించి, ఒక భారీ సైబర్ దాడిని సృష్టించగలదు. మనుషులు రోజంతా చేసే పరిశోధనను ఇది చాలా తక్కువ సమయంలో పూర్తి చేస్తూ, Autonomousగా పనిచేస్తోంది.

Advertisement

ఈ మోడల్ తప్పుడు చేతుల్లోకి వెళ్తే ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉందని ఆంత్రోపిక్ హెచ్చరించింది. అందుకే దీనిని నేరుగా ప్రజలకు విడుదల చేయకుండా, ప్రాజెక్ట్ గ్లాస్‌వింగ్ పేరుతో ఒక సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ప్రపంచంలోని కీలకమైన సాఫ్ట్‌వేర్ సంస్థలకు ఈ టూల్‌ను అందించి, వారు తమ కోడ్‌లోని లోపాలను ముందే గుర్తించి సరిదిద్దుకునేలా సహకరిస్తోంది. హ్యాకర్ల కంటే ముందే మన రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.

ఈ మోడల్ సహాయంతో గత కొన్ని వారాల్లోనే గతంలో ఎన్నడూ లేనంతగా వేల సంఖ్యలో బగ్స్‌ను గుర్తించినట్లు సంస్థ తెలిపింది. ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలకు ఆధారమైన ‘ఓపెన్ సోర్స్’ కోడ్‌లను స్కాన్ చేసినప్పుడు విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. గత 27 ఏళ్లుగా ఎవరూ గుర్తించని ఒక పెద్ద లోపాన్ని క్లాడ్ మిథోస్ కనిపెట్టింది. కేవలం కొన్ని పీసెస్ ఆఫ్ డేటా పంపడం ద్వారా ఆ సర్వర్‌ను క్రాష్ చేసే ప్రమాదం ఉందని గుర్తించారు. ఆ లోపాల‌ను వెంటనే దానిని సరిదిద్దారు.

Advertisement

నేడు మన నిత్యజీవితంలో ప్రతి అంశం సాఫ్ట్‌వేర్‌తో ముడిపడి ఉంది. బ్యాంకింగ్ లావాదేవీలు, కస్టమర్ డేటా, ఆర్థిక వ్యవస్థలు.. ఇలా అన్నీ డిజిటల్ వ్యవస్థలపైనే నడుస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ భద్రత దెబ్బతింటే అది మొత్తం సమాజంపైనే ప్రభావం చూపుతుందని ఆంత్రోపిక్ స్పష్టం చేసింది.

లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఒక సాధారణ యూజర్ కూడా అడ్మినిస్ట్రేటర్ స్థాయి అధికారాలను పొందేలా ఉన్న కొన్ని భద్రతా లోపాలను ఇది బయటపెట్టింది. వీటన్నింటిని సాఫ్ట్‌వేర్ మెయింటైనర్లకు తెలియజేసి, ప్యాచ్‌లను విడుదల చేయడం ద్వారా ఇప్పుడు ఆ వ్యవస్థలను సురక్షితం చేశారు. అమెరికా ప్రభుత్వం, ఇతర టెక్ సంస్థలతో కలిసి ఏఐ వల్ల కలిగే నష్టాలను అంచనా వేస్తూ, రక్షణ కవచాలను నిర్మించే పనిలో పడింది. ఈ ప్రక్రియ కొన్ని నెలలు లేదా ఏళ్ల పాటు కొనసాగవచ్చని, కానీ అంతిమంగా ప్రపంచాన్ని సైబర్ దాడుల నుండి సురక్షితంగా ఉంచడమే తమ లక్ష్యమని సంస్థ ప్రకటించింది.

Read Also: యూట్యూబ్ టిప్స్.. 500 సబ్‌స్క్రైబర్లు ఉన్నా ఇక డబ్బులొస్తాయ్, ఇలా చేస్తే చాలు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×