E-Paper
Advertisement

Snake Bite: నువ్వు తోపు బాస్..! కాటేసిన పాముతో హాస్పిటల్‌కి..

Snake Bite: నువ్వు తోపు బాస్..! కాటేసిన పాముతో హాస్పిటల్‌కి..
Advertisement

Snake Bite: నెల్లూరు జిల్లాలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగా పాము కనిపిస్తేనే భయంతో పరుగులు తీసే ఈ రోజుల్లో.. తనను కాటేసిన పామునే వెంటబెట్టుకుని ఒక వ్యక్తి ఆసుపత్రికి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

కోవూరు పట్టణంలోని ఒక స్థానిక హోటల్‌లో ఓ వ్యక్తి భోజనం చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అతను ఆహారం తింటుండగా ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ ఒక రక్తపింజరి పాము అకస్మాత్తుగా అతనిపై దాడి చేసి కాటేసింది. రక్తపింజరి అత్యంత విషపూరితమైన పాము కావడంతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

Advertisement

పాము కాటేయగానే భయపడిపోకుండా, ఆ వ్యక్తి వెంటనే స్పందించాడు. తనను కాటేసిన ఆ పామును అక్కడికక్కడే కొట్టి చంపేశాడు. అంతటితో ఆగకుండా, వైద్యులకు ఏ పాము కుట్టిందో చూపిస్తే చికిత్స సులభమవుతుందని భావించిన ఆ వ్యక్తి.. చనిపోయిన ఆ పామును చేత్తో పట్టుకుని నేరుగా కోవూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నాడు.

వ్యక్తి చేతిలో పామును పట్టుకుని ఆసుపత్రి లోపలికి రావడం చూసి అక్కడి రోగులు, సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కొందరు భయంతో అటు ఇటు పరుగులు తీశారు. అయితే.. అతను జరిగిన విషయాన్ని వివరించడంతో వైద్యులు వెంటనే అతనికి అత్యవసర చికిత్స ప్రారంభించారు. పామును గుర్తించడం వల్ల సరైన యాంటీ వీనమ్ అందించడం వైద్యులకు సులభమైంది. ప్రస్తుతం బాధితుడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.

Advertisement

Also Read: మౌనం వీడండి! ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంపై కేంద్రానికి సోనియా గాంధీ సీరియస్ వార్నింగ్!

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×