E-Paper
Advertisement

ACs Buying Tips: కొత్త ఏసీ కొనాలంటే.. ఈ నాలెడ్జ్ తప్పనిసరి.. లేదంటే ఈజీగా మోసపోతారు!

ACs Buying Tips: కొత్త ఏసీ కొనాలంటే.. ఈ నాలెడ్జ్ తప్పనిసరి.. లేదంటే ఈజీగా మోసపోతారు!
Advertisement

ACs Buying Tips: సమ్మర్ లో ఏసీలకు ఏ స్థాయిలో డిమాండ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. కొందరు బడ్జెట్ ఏసీలు కొనుగోలు చేస్తే.. మరికొందరు స్మార్ట్ ఫీచర్లు ఉన్న ఏసీలపై ఆసక్తి చూపిస్తుంటారు. అయితే కొత్తగా ఏసీ కొనేటప్పుడు కొన్ని అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలి. అలా చేయని పక్షంలో ఎంత మంచి ఏసీ కొన్నప్పటికీ ప్రయోజనం అంతంతమాత్రంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ ఆంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఇండోర్, అవుట్ డోర్ యూనిట్లు

ఏసీలు సాధారణంగా రెండు యూనిట్లతో లభిస్తాయి. ఇండోర్, అవుట్ డోర్ యూనిట్లతో వచ్చేవాటిని స్ప్లిట్ ఏసీలు అంటారు. అవుట్ డోర్ యూనిట్.. ఇంటి బయటవైపు గోడ లేదా నేలపై అమరుస్తారు. ఇండోర్ ను గదిలోపల గోడపై ఫిక్స్ చేస్తారు. అవుట్ డోర్ యూనిట్ పంపించే బయటి గాలిని ఇండోర్ యూనిట్ చల్లబరిచి.. గదిని కూలింగ్ చేస్తుంది. అయితే మార్కెట్ లో సింగిల్ యూనిట్ ఏసీలు సైతం లభిస్తున్నాయి. వీటిని పోర్టబుల్ ఏసీలు అని కూడ అంటారు. ఇవి స్ప్లిట్ ఏసీల కంటే తక్కువ కూలింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

గది పరిమాణం

Advertisement

మీరు కొత్త ఏసీ కొనేముందు దానిని అమర్చాలని భావిస్తున్న గది పరిమాణాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే గది వైశాల్యాన్ని బట్టి ఏసీ సామర్థ్యాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. గది 100 చదరపు అడుగుల లోపు ఉంటే 0.8 – 1 టన్ ఏసీ సరిపోతుంది. అలాగే 100-150 చదరపు అడుగులే ఉంటే 1.5 టన్, 150 చదరపు అడుగులకు పైగా ఉంటే 2 టన్నుల సామర్థ్యమున్న ఏసీని ఎంచుకోవాల్సి ఉంటుంది. గది చిన్నగా ఉండి అధిక సామర్థ్యమున్న ఏసీ కొనుగోలు చేస్తే పవర్ బిల్లు అధికంగా రావొచ్చు. అలా కాకుండే పెద్ద గదికి తక్కువ సామర్థ్యం ఉన్న ఏసీని కొనుగోలు చేస్తే అనుకున్న స్థాయిలో కూలింగ్ రాకపోవచ్చు.

ఇన్వర్టర్ vs నాన్ – ఇన్వర్టర్

ప్రస్తుత రోజుల్లో ఇన్వర్టర్ ఏసీలు కొనుగోలు చేయడం చాలా ఉత్తమం. ఇవి గది ఉష్ణోగ్రతను బట్టి కంప్రెస్ వేగాన్ని సర్దుబాటు చేస్తాయి. దీనివల్ల 30-50 శాతం వరకూ విద్యుత్ ఆదా అవుతుంది. పైగా ఇన్వర్టర్ ఏసీలు తక్కువ శబ్దంతో పనిచేస్తాయి. ఇక నాన్ ఇన్వర్టర్ ఏసీలు విషయానికి వస్తే.. ఇవి పాత టెక్నాలజీతో లభిస్తాయి. కాబట్టి లేటెస్ట్ రకం ఏసీలు కోరుకునేవారికి ఇవి అంత మంచి ఆప్షన్ గా అనిపించదు.

స్టార్ రేటింగ్..

Advertisement

ఏసీల్లోని ప్రధాన ఫీచర్లలో స్టార్ రేటింగ్ ఒకటి. BEE రేటింగ్ ఎంత ఎక్కువగా ఉంటే అది అంత తక్కువ విద్యుత్ ను వినియోగిస్తుందని అర్థం. 2 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీతో పోలిస్తే 5 స్టార్ కలిగిన ఏసీ తక్కువ విద్యుత్ బిల్లును అందిస్తుంది. అధిక రేటింగ్ ఉన్న ఏసీల ధర మార్కెట్ లో ఎక్కువగా ఉన్నప్పటికీ రాంగ్ రన్ లో ఇవి చాలా ఖర్చును ఆదా చేస్తాయి.

కాయిల్ రకం..

మీరు కొనుగోలు చేయబోయే ఏసీలో ఎల్లప్పుడూ కాపర్ కాయిల్ ఉండేలా జాగ్రత్త పడండి. ఇవి ఇతర కాయిల్స్ తో పోలిస్తే చాలా వేగంగా గదిని చల్లబర్చడంలో దోహదం చేస్తాయి. దీర్ఘకాలంగా మన్నికగా ఉంటాయి. ఇతర వాటితో పోలిస్తే రిపేర్ల అవసరం తక్కువ. ఒక వేళ సమస్య వచ్చినా అల్యూమినియం కాయిల్స్ తో పోలిస్తే.. వీటిని రిపేర్ చేయడం చాలా సులభంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

నిద్రకు భంగం కలిగించకుండా..

కొన్ని ఏసీలు అధిక శబ్దంతో పనిచేస్తుంటాయి. దీనివల్ల రాత్రిళ్లు నిద్రకు ఆటంకం కలుగవచ్చు. కాబట్టి కొనేముందు ఇండోర్ యూనిట్ నాయిస్ లెవెల్ ను తప్పకుండా చెక్ చేయండి. సాధారణంగా 40dB కంటే తక్కువ ఉంటే ఆ ఏసీ చాలా సైలెంట్ గా పని చేస్తుందని అర్థం.

Also Read: Apsara Rani : గ్రీన్ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ఆర్జీవి బ్యూటీ స్టిల్స్.. చూపు తిప్పుకోవడం కష్టమే..

సర్వీస్ – వారంటీ

ఏసీలు కొనేముందు అనుసరించాల్సిన ముఖ్యమైన అంశాలైన సర్వీస్ వారంటీ ఒకటి. మీ ప్రాంతంలో ఏ బ్రాండ్ కంపెనీకి మంచి సర్వీస్ సెంటర్లు ఉన్నాయో తెలుసుకొని అందుకు అనుగుణంగా ఏసీని కొనుగోలు చేస్తే మంచింది. కంప్రెసర్ పై 10 ఏళ్ల వారంటీ, గ్యాస్ లీకేజీలపై వారంటీలు ఇచ్చే కంపెనీలకు అధిక ప్రాధాన్యత ఇస్తే బెటర్.

Also Read: iPhone 16e Discount: ఐఫోన్ 16eపై సూపర్ డీల్.. ఏకంగా రూ.11000 తగ్గింపు.. ఆఫర్ ఎక్కడంటే

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×