E-Paper
Advertisement

Indian Restaurant Closure: పాక్ వేధింపులు.. లండన్‌లో మూతపడ్డ భారత రెస్టారెంట్.. యజమాని భావోద్వేగం!

Indian Restaurant Closure: పాక్ వేధింపులు.. లండన్‌లో మూతపడ్డ భారత రెస్టారెంట్.. యజమాని భావోద్వేగం!
Advertisement

Indian Restaurant Closure: పాక్ పౌరుల వేధింపులు తాళలేక లండన్ లోని భారత రెస్టారెంట్ మూతపడింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రెస్టారెంటు యజమాని సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యారు. ఆన్ లైన్ పాక్ పౌరుల వేధింపులు ఎక్కువ కావడం, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో ఈ కఠిన నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టం చేశారు. 16 ఏళ్లుగా తమకు అండగా నిలిచిన కస్టమర్లకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

భారత సంతతి వ్యక్తి హర్మాన్ సింగ్ కపూర్ ఏర్పాటు చేసిన రంగ్రెజ్ రెస్టారెంట్ గత 16 ఏళ్లుగా అక్కడి పౌరులకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తూ వచ్చింది. అయితే హర్మాన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ షాకింగ్ ప్రకటన చేశారు. పెరుగుతున్న ఖర్చులు, స్థానిక అధికారుల మద్దతు లేకపోవడం, ఆన్ లైన్ వేధింపులు, కొన్ని సమూహాల ప్రత్యక్ష బెదిరింపులు కారణంగా రెస్టారెంట్ నిర్వహణ అసాధ్యంగా మారిపోయిందని వాపోయారు. కాబట్టి రెస్టారెంట్ ను మూసివేయాలన్న కఠిన నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టం చేశారు. వచ్చే నెల నుంచి రంగ్రెజ్ రెస్టారెంట్ మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

లండన్ లోని పాకిస్థానీలు తన రెస్టారెంట్ నిర్వహణకు పదే పదే ఆటంకాలు సృష్టిస్తూ వస్తున్నారని యజమాని హర్మాన్ సింగ్ కపూర్ వాపోయారు. ఆన్ లైన్ లో వేధించడంతో పాటు ప్రత్యక్ష దాడులకు సైతం తెగబడినట్లు ఎక్స్ వేదికగా ఆరోపణలు చేశారు. దీనిపై స్థానిక మెట్రోపాలిటన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన చర్యల లేకుండా పోయాయని తెలిపారు. వారి నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదని ఆరోపించారు. కాబట్టి ఇక రెస్టారెంట్ ను నిర్వహించలేమన్న అభిప్రాయానికి తాను వచ్చేసినట్లు తెలియజేశారు.

Advertisement

Also Read: Viral Video: రైలులో చిప్స్ పారేసిన 2 ఏళ్ల కొడుకు.. తండ్రి చేసిన పనికి.. నెట్టింట ప్రశంసలు!

లండన్ లో ప్రముఖ భారతీయ రెస్టారెంట్ గా పేరున్న రంగ్రెజ్ ను మూసివేయడంపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. తాను రంగ్రెజ్ రెస్టారెంట్ ను గతంలో సందర్శించానని.. వారి ఆతిథ్యం, ఆహారం చాలా బాగా అనిపించిందని చెప్పారు. మరి స్థానికులు తప్పుడు రివ్యూలు ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదన్నారు. పాక్ పౌరుల కుట్రగా అతడు అభివర్ణించాడు. మరో నెటిజన్ స్పందిస్తూ తనకు రెస్టారెంట్ వ్యాపారం ఉందని.. పెరుగుతున్న ఖర్చులను అర్థం చేసుకోగలనని చెప్పారు. ఇంకొక నెటిజన్ స్పందిస్తూ.. మీ విషయంలో జరిగిందని అన్యాయమని పేర్కొన్నారు.

Also Read: Upcoming ACs march 2026: మార్చిలో రాబోతున్న.. మోస్ట్ వాంటెడ్ ఏసీలు.. మిడిల్ క్లాస్‌కు పండుగే!

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×