E-Paper
Advertisement

Kerala to Keralam: కేరళ రాష్ట్రం పేరు ఎందుకు మార్చారు? ‘కేరళం’ అంటే ఏమిటీ?

Kerala to Keralam: కేరళ రాష్ట్రం పేరు ఎందుకు మార్చారు? ‘కేరళం’ అంటే ఏమిటీ?
Advertisement

ప్రకృతి అందాలతో ఆకట్టుకునే కేరళ రాష్ట్రం పేరు మారబోతోంది. కేరళ ఇకపై ‘కేరళం’ కాబోతోంది. పేరు మార్పునకు తాజాగా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.  నేమ్ ఛేంజ్ కు సంబంధించి పినరయి సర్కారు పంపిన ప్రతిపాదనలకు పరిశీలించి పచ్చ జెండా ఊపేసింది. ప్రాంతీయ భాషలను గౌరవిండంతో పాటు ఆయా రాష్ట్రాల సంస్కృతులను గౌరవించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. కేరళ పేరు మార్పునకు సంబంధించి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానం చేసింది. మలయాళంలో ఆ రాష్ట్రాన్ని కేరళం అని పిలుస్తారు. అఫీషియల్ గానూ అలాగే పిలవాలని అసెంబ్లీ నిర్ణయించింది. ఈ పేరు మార్పును ప్రాంతీయ గౌరవానికి ప్రతిబింబంగా భావించాలని కోరింది. ఈ నేపథ్యంలో కేంద్రం సానుకూలంగా స్పందించింది. త్వరలోనే పేరు మార్పుకు సంబంధించి రాజ్యాంగపరమైన ప్రక్రియ పూర్తి కానుంది.

‘కేరళం’ అంటే అర్థం ఏంటి?

ఇక కేరళ పేరు మార్పునకు సంబంధించి పెద్దగా మార్పులు ఏమీ లేవు. కేరళ.. ‘కేరళం’ కాబోతోంది. దానికి ఒకే ఒక్క కారణం ఆ రాష్ట్ర ప్రజలు మాట్లాడే మలయాళ భాషలో ‘కేరళం’ అనేది సాంప్రదాయ పేరు కావడం. 1956కి ముందు ఇప్పుడు కేరళ అని పిలువబడే ప్రాంతం ఒకే రాష్ట్రంగా ఉండేది కాదు. కాదు. ఇందులో ట్రావెన్‌ కోర్, కొచ్చిన్,  ప్రాంతాలు 1949లో విలీనం అయ్యాయి. ట్రావెన్‌ కోర్-కొచ్చిన్, తిరు-కొచ్చి అనే ప్రాంతాలు ఏర్పడ్డాయి. మలబార్ జిల్లా మద్రాస్ రెసిడెన్సీలో భాగంగా ఉండేది. నవంబర్ 1, 1956న, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం, మలయాళం మాట్లాడే ప్రాంతాలను భాషాపరంగా ఒక్కటి చేయడం కోసం కేరళ పేరుతో రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. అందుకే, నవంబర్ 1ని కేరళ పిరవి లేదంటే కేరళ పుట్టిన రోజుగా జరుపుకుంటారు.

‘కేరళం’ అని పేరు మార్చేందుకు కారణం ఏంటి?    

Advertisement

కేరళ ప్రజలు మలయాళంలో ఆ రాష్ట్రాన్ని‘కేరళం’ అని పిలుస్తారు. ప్రజలు తమ మాతృభాషకు అనుకూలంగా రాష్ట్రం పేరు ఉండాలని భావిస్తున్నారు. కేరళం అనేది స్థానిక ఉచ్చారణ, సాంస్కృతిక గుర్తింపును గౌరవించడంగా భావిస్తారు. అందుకు అనుగుణంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కేరళ పేరు మార్చాలని కేంద్రాన్ని కోరింది.

‘కేరళం’ పేరు వెనుక వేల ఏళ్ల చరిత్ర!  

కేరళ, కేరళం అనే పదాలు సుమారు 2,000 సంవత్సరాల నాటివి నాటిది. అశోక చక్రవర్తి శిలా శాసనం II (సుమారు 257 BCE) ఈ విషయాన్ని వెల్లడిస్తుంది. ఆ శాసనంలో ఈ ప్రాంతం పాలకుని కేరళపుత్ర అని రాసి ఉంది. ఆయన చేర రాజ్యానికి రాజు. చేర అనేది మూడు ప్రధాన పురాతన తమిళ రాజ్యాలలో ఒకటి. చేర, చోళ, పాండ్య రాజ్యాలతో సమానంగా ఉండేది. చేర, కేర పాత తమిళ, మలయాళ సందర్భాలలో ఒకే పదం రూపాంతరం చెందింది.  చేరళం నుంచి చేరల భూమి అని వచ్చింది. మలయాళంలో కేర  అంటే కొబ్బరి చెట్టు అని అర్థం. ఆలం అంటే భూమి. కొబ్బరి భూమిగా గుర్తింపు తెచ్చుకుంది.  ఎందుకంటే, కేరళలో సమృద్ధిగా కొబ్బరి తోటలు ఉన్నాయి. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న కేరళ పేరు మరికొద్ది రోజుల్లోనే ‘కేరళం’గా మారబోతోంది.

Advertisement

Read Also: దేవభూమి అందాలు.. మున్నార్, వయనాడ్, అలప్పుజ.. సమ్మర్‌లో తప్పక చూడాల్సిందే!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×