// // God Of Marriage: దేవుడా!.. 4 భార్యలు, 2 గర్ల్‌ఫ్రెండ్స్, 10 మంది పిల్లలు.. భార్యల సంపాదనపై బతుకుతున్నాడు! -->
E-Paper
Advertisement

God Of Marriage: దేవుడా!.. 4 భార్యలు, 2 గర్ల్‌ఫ్రెండ్స్, 10 మంది పిల్లలు.. భార్యల సంపాదనపై బతుకుతున్నాడు!

God Of Marriage: దేవుడా!.. 4 భార్యలు, 2 గర్ల్‌ఫ్రెండ్స్, 10 మంది పిల్లలు.. భార్యల సంపాదనపై బతుకుతున్నాడు!
Advertisement

God Of Marriage| పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారికే మంచి భార్య దొరకని ఈ రోజుల్లో.. ఏ ఉద్యోగం లేని ఒక మనిషికి ఏకంగా నలుగురు భార్యలు వీరికి తోడు మరో ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వీరందరితో అతనికి 10 మంది సంతానం. ఇదంతా ఆరు సంవత్సరాల్లో సాధించాడు. ఇంకా పెళ్లిళ్లు చేసుకుంటాడట, జపాన్ చరిత్రలో ఎక్కువ మంది పిల్లలను కని రికార్డు సృష్టిస్తాడట. వీడి గురించి వింటేనే సాటి మగాళ్లకు అసూయ కలుగుతుంది. కానీ ఇంతటితో అయిపోలేదు. ఇతను గత 10 సంవత్సరాలు ఏ ఉద్యోగం చేయడంలేదు. ఇంటి ఖర్చు అంతా అతని భార్యలే భరిస్తున్నారు. వారంతా ఉద్యోగాలు చేస్తే.. ఇతను వారానికి 28 సార్లు శృంగారం చేస్తాడట. వింటేనే మండిపోతోంది కదూ..

వివరాల్లోకి వెళితే.. రియుతా వటనాబె అనే 36 ఏళ్ల యువకుడు జపాన్ దేశంలోని హోక్కాయిడో ఐలాండ్స్ లో నివసిస్తున్నాడు. అయితే గత 10 ఏళ్లుగా అతను ఏ ఉద్యోగం చేయడంలేదు. ఈ కారణంగా ఆరేళ్ల క్రితం అతని గర్ల్ ఫ్రెండ్ అతడితో బ్రేకప్ చేసుకొని వెళ్లిపోయింది. దీంతో వటనాబె పాపం షాక్ కు గురయ్యాడు. కానీ ఈ షాక్ నుంచి తేరుకోవడానికి వటనాబెకు ఎక్కువ సమయం పట్టలేదు. వటనాబె వెంటనే డేటింగ్ యాప్స్ లో తన స్టోరీని, తన గర్ల్ ఫ్రెండ్ చేసిన అన్యాయాన్ని షేర్ చేశాడు. అంతే.. వటనాబె నిజాయితీగా ప్రేమించే యువకుడని భావించిన అమ్మాయిలు అతని ప్రేమ కోసం క్యూ కట్టారు.

Advertisement

అలా వటనాబె గత ఆరేళ్లలో నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. పైగా అతని భార్యలు అతడిని ఇంట్లోనే ఉండి పిల్లలను చూసుకోమని చెప్పి ఆఫీసుకు వెళ్లిపోతారు. వారు తిరిగి వచ్చేంతవరకు వటనాబె ఇంట్లో ఉండి వంట చేయడం, పిల్లలను చూసుకోవడం, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వంటి పనులు చేస్తుంటాడు. ఈ పనులు పూర్తవగానే తన టార్గెట్ వైపు దృష్టిసారిస్తాడు. అదేంటంటారా?.. ఇంకేముంది అతనికి ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారితో చాటింగ్ చేస్తాడు. భార్యలు ఆఫీసుకు వెళ్లగానే వారితో ఇంట్లో ఎంజాయ్ చేస్తాడు. ఇదంతా అతని భార్యలకు తెలిసే జరుగుతోంది.

Also Read:  ‘నా ఇష్టం మీకేంటి?’.. 16 ఏళ్ల అబ్బాయిని డేట్ చేస్తున్న 21 ఏళ్ల భామ..

Advertisement

ప్రతినెలా ఇంటి ఖర్చులకు దాదాపు రూ.5 లక్షలకు పైగా అవుతుంది. ఇదంతా అతని భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటారు. ఇంట్లో అతని భార్యలకు విడివిడిగా బెడ్ రూమ్ లు ఉన్నాయి. వటనాబె మాత్రం వారందరితో రొటేషన్ పద్ధతిలో వారి గదులలో పడుకుంటాడు. వటానాబె ఇటీవల అబెమా ప్రైమ్ అనే ఒక జపానీస్ టీవీ షోలో పాల్గొన్నాడు. అందులో అతను మాట్లాడుతూ.. తన భార్యలు, ప్రేమికురాళ్ల మధ్య ఈర్షా, ద్వేషాలు లేవని అందరూ తనను సమానంగా ప్రేమిస్తారని.. వారంతా అందించే ప్రేమ వల్లే తాను సూపర్ ఎనర్జీతో ఉంటానని తెలిపాడు.

ఈ ఎనర్జీ కారణంగానే తన భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ తో వారానికి 28 సార్లు శృంగారం చేస్తానని అతిశయోక్తిగా మాట్లాడాడు. జపాన్ లో ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడానికి అనుమతి లేదు. అందుకే వటనాబె వారందరినీ మత ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. కానీ వివాహాల రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. దీంతో అతను చేస్తున్నది నేరం కిందకు రాదు.

టీవిషలో వటనాబె మాట్లాడుతూ.. జపాన్ చరిత్రలో అత్యధిక పిల్లలకు జన్మనిచ్చిన తండ్రిగా టోకుగవా లెనారి అనే పురుషుడు 1841లో రికార్డు సృష్టించాడు. అతనికి 53 మంది పిల్లలుండేవారు. కానీ తాను ఆ రికార్డు బద్దలుకొట్టేందుకు కనీసం 54 మందిని పిల్లలను కంటానని చెప్పాడు. అందుకోసం మరింత మంది గర్ల్ ఫ్రెండ్స్ కోసం డేటింగ్ యాప్స్ లో వెతికే పనిలో ఉన్నట్లు చెప్పాడు.

వటనాబె స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నెటిజెన్లు ఇతని జీవితం గురించి రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×