E-Paper
Advertisement

Niloufer Hotel: నీలోఫర్ హోటల్‌లో ‘బొద్దింక’ కలకలం.. వీడియో వైరల్..!

Niloufer Hotel: నీలోఫర్ హోటల్‌లో ‘బొద్దింక’ కలకలం.. వీడియో వైరల్..!
Advertisement

Niloufer Hotel: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) ఎంతో ప్రతిష్టాత్మకమైనది, కానీ ఇటీవల ఇక్కడి నీలోఫర్ కేఫ్ ఔట్‌లెట్‌లో కనిపించిన దృశ్యాలు ప్రయాణికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఆహార పదార్థాలను ప్రదర్శనకు ఉంచిన కౌంటర్లలో ఓ బొద్దింక తిరుగుతుండటం ఒక ప్రయాణికుడి కంట పడింది.

నాణ్యతకు, రుచికి మారుపేరుగా చెప్పుకునే ఇలాంటి బ్రాండెడ్ సంస్థల్లో సైతం కనీస పారిశుధ్య ప్రమాణాలు పాటించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విమానాశ్రయాల్లో ఆహార పదార్థాల ధరలు సామాన్యులకు అందనంత స్థాయిలో ఉన్నప్పటికీ, కేవలం నాణ్యత, పరిశుభ్రత ఉంటుందనే నమ్మకంతో ప్రయాణికులు అక్కడ కొనుగోలు చేస్తుంటారు.

Advertisement

అయితే, ఈ తాజా ఘటనతో ఆ నమ్మకం సడలిపోయింది. సదరు ప్రయాణికుడు ఈ అపరిశుభ్ర దృశ్యాలను తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. కేవలం ప్రచార చిత్రాలకే పరిమితమైన పరిశుభ్రత, వాస్తవంలో అమలు కావడం లేదనడానికి ఈ ఘటనే నిదర్శనమని నెటిజన్లు మండిపడుతున్నారు.

అలాగే ప్రజా ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న ఇలాంటి యాజమాన్యాలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాల్లో పర్యవేక్షణ లోపం వల్ల నగర ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also Read: షాకింగ్.. సంక్రాంతి పండుగ తేదీలు మారాయి.. పందెం రాయుళ్లకు టెన్షన్.. 

వేల రూపాయలు ఖర్చు పెట్టడం.. వినియోగదారులకు సురక్షితమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత సంస్థల మీద ఎంతైనా ఉందని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తనిఖీలు ముమ్మరం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×