E-Paper
Advertisement

Rivaba Jadeja: రాజ‌స్థాన్ ను బెదిరించిన బీజేపీ లేడీ ఎమ్మెల్యే ? జ‌డేజాకు కెప్టెన్సీ ఆఫ‌ర్‌

Rivaba Jadeja: రాజ‌స్థాన్ ను బెదిరించిన బీజేపీ లేడీ ఎమ్మెల్యే ? జ‌డేజాకు కెప్టెన్సీ ఆఫ‌ర్‌
Advertisement

Rivaba Jadeja: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే సీజన్ కోసం కొత్త కెప్టెన్ గా డేంజర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పేరును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి హింట్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. సినిమా హీరో రేంజ్ లో ఉన్న రవీంద్ర జడేజా ఫోటోను, షేర్ చేసిన రాజస్థాన్ రాయల్స్… అతడే కెప్టెన్ అంటూ పరోక్షంగా వెల్లడించింది. అయితే ఈ నేపథ్యంలో ఒక కొత్త అంశం తెరపైకి వచ్చింది. రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ రావడం వెనుక ఆయన భార్య, బిజెపి పార్టీ ఎమ్మెల్యే, గుజరాత్ మంత్రి రివాబా జడేజా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె బిజెపి పెద్దలతో రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకువచ్చిందట. ఈ నేపథ్యంలోనే రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ ఇస్తున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Also Read: Ravichandran Ashwin: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 కంటే సీరియ‌ల్స్ చూడ‌టం బెట‌ర్‌..టీమిండియా ఆడ‌టం దండ‌గే

రాజ‌స్థాన్ ను బెదిరించిన బీజేపీ లేడీ ఎమ్మెల్యే ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఓ కెప్టెన్ అవసరం. సంజు శాంసన్ ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరిపోయాడు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి వచ్చిన రవీంద్ర జడేజాకు ఇప్పుడు కెప్టెన్సీ ఇవ్వబోతున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో దళపతి అంటూ ఓ పోస్టర్ కూడా పెట్టింది రాజస్థాన్ రాయల్స్. ఇందులో హీరో లాగా రవీంద్ర జడేజా కనిపించాడు. దీంతో అతడే వచ్చే సీజన్ కెప్టెన్ అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

అయితే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ కావాలని రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ లాంటి వాళ్లు చాలా ప్రయత్నాలు చేశారట. కానీ రాజస్థాన్ రాయల్స్ మాత్రం రవీంద్ర జడేజాకు మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. అయితే దీని అంతటి వెనుక రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. గుజరాత్ లో విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఈ బీజేపీ లీడర్ రివాబా జడేజా, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకువచ్చారట. తన భర్తకి కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ అండ చూసుకొని ఆమె ఈ డిమాండ్ తెరపైకి తీసుకువచ్చారట. దీంతో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా రవీంద్ర జడేజా పేరును ఖరారు చేసినట్లు టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రెండు లేదా మూడు రోజుల్లో వ‌స్తుంద‌ని అంటున్నారు. కాగా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2026 టోర్న‌మెంట్ మార్చి 26 వ తేదీ నుంచి మే 31 వ‌ర‌కు కొన‌సాగ‌నుంద‌ట‌.

Advertisement

Also Read:  BCCI-Mustafizur Rahman: ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ ఔట్..బీసీసీఐ కీల‌క ఆదేశాలు, రూ.9.20 కోట్లు గంగ‌పాలు

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×