E-Paper
Advertisement

Kuwait Crisis: బాంబుల మోత.. పవన్ గారు కాపాడండి! కువైట్ నుండి మహిళ వీడియో!

Kuwait Crisis: బాంబుల మోత.. పవన్ గారు కాపాడండి! కువైట్ నుండి మహిళ వీడియో!
Advertisement

Kuwait Crisis: మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు రోజు రోజుకీ తారా స్థాయికి చేరుకుంటున్నాయి. పొట్ట కూడు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వేలాది మంది అక్కడే చిక్కుకోని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీకి చెందిన ఓ మహిళ తనను తిరిగి తన స్వగ్రామానికి తీసుకురండి అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేసింది.

కువైట్‌లోని పిఠాపురం నియోజకవర్గం రథాలపేట గ్రామానికి చెందిన దాకే కుమారి పడుతున్న ఆవేదన ప్రస్తుతం అందరినీ కలచివేస్తోంది. ఉపాధి కోసం నాలుగు నెలల క్రితమే కువైట్ వెళ్లిన ఆమె, ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇరాన్ ,ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు కువైట్‌లోని పరిస్థితులపై కూడా ప్రభావం చూపుతుండటంతో, అక్కడ ఉండలేక తనను ఎలాగైనా స్వగ్రామానికి రప్పించాలని ఆమె వేడుకుంటున్నారు.

Advertisement

కుమారి తన భర్త ,ముగ్గురు పిల్లలను ఇంటి వద్దే వదిలి వెళ్లారు. అక్కడ నెలకొన్న అస్థిరత కారణంగా తన ప్రాణాలకు ముప్పు ఉందని, తన పిల్లలు ఇక్కడ తన కోసం ఏడుస్తున్నారని ఆమె ఒక వీడియో సందేశం ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, తనను కాపాడి క్షేమంగా తన కుటుంబం దగ్గరికి చేర్చాలని ఆమె సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లను కోరింది.

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో, కుమారి లాంటి వలస కార్మికుల భద్రత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పిఠాపురం నియోజకవర్గ నాయకులు ,ప్రభుత్వం ఈ విషయంలో తక్షణమే స్పందించి విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా ఆమెను సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Advertisement

Also Read:మంగళగిరిలో విషాదం.. పరుగు పందెంలో హెడ్ కానిస్టేబుల్ మృతి

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×