E-Paper
Advertisement

లోకేశ్ గారూ.. కదిరి పిల్లల కష్టాలు కనిపిస్తున్నాయా?

లోకేశ్ గారూ.. కదిరి పిల్లల కష్టాలు కనిపిస్తున్నాయా?
Advertisement

Kadiri ZPHS: కదిరి ZPHSలో ప్రమాదం జరిగింది. మధ్యాహ్న భోజనం సమయంలో.. వేడి వేడి కర్రీ విద్యార్థులపై పడింది. ఈ ఇష్యూపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించకపోవడం విమర్శలకు దారితీసింది.

Advertisement

స్కూల్‌లో మధ్యాహ్న భోజనం వడ్డించడానికి డైనింగ్ హాల్ లేదు. విశాలమైన స్థలం లేదు. విద్యార్థులంతా.. ఆ ఇరుకైన కారిడార్ల మధ్యే కూర్చొని తినాలి. పిల్లలంతా వరుసగా కూర్చున్నారు. కర్రీ తెస్తున్న వ్యక్తి ఒక్కసారిగా కాలుజారి కిందపడ్డారు. అంతే.. అతని చేతిలోని పెద్ద గిన్నెలో నుంచి వేడి వేడి కర్రీ క్షణంలో ఎగసి విద్యార్థులపై పడింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి జడ్పీ హైస్కూల్‌లో జరిగింది ఈ ప్రమాదం. ఏడుగురు విద్యార్థులు గాయపడ్డారు.

ఇరుకు ప్రదేశంలో భోజనం వడ్డించడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విద్యార్థులను గుట్టుగా ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. టీచర్లు సరిగ్గా చూసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందనే విమర్శలు వస్తున్నాయ్. ఈ ఘటనపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిమీదే ఇప్పుడు చర్చ నడుస్తోంది.

Advertisement

Also Read: ఫార్ములా-ఈ స్కామ్‌లో KTR A-1.. ఏసీబీ 77 పేజీల ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

Tags

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×