E-Paper
Advertisement

తెలంగాణకు రండి.. పెట్టుబడులు పెట్టండి.. సీఐఐ ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

తెలంగాణకు రండి.. పెట్టుబడులు పెట్టండి.. సీఐఐ ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
Advertisement

Revanth Reddy: సీఐఐ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఉన్న అవకాశాలను, ప్రభుత్వ లక్ష్యాలను ఈ సందర్భంగా ఆయన స్పష్టంగా వివరించారు.

పెట్టుబడులకు సురక్షిత ప్రాంతం

Advertisement

తెలంగాణ పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన రాష్ట్రమని, పరిశ్రమలకు ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎలాంటి ‘పాలసీ పెరాలసిస్’ లేదని, గతంలో ఉన్న మంచి పారిశ్రామిక విధానాలను కూడా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అలాగే, అమెజాన్ రూ.1 లక్ష కోట్లు, అదానీ గ్రూప్ రూ.35 వేల కోట్లతో డేటా సెంటర్లలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని గుర్తుచేశారు.

ట్రిలియన్ డాలర్ల ఎకానమీయే లక్ష్యం

Advertisement

రాష్ట్రాన్ని 2037 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. ఫార్చ్యూన్-500 కంపెనీలను నూతనంగా నిర్మిస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’కి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.

అభివృద్ధి మోడల్, నైపుణ్యాల పెంపు

సేవలు, తయారీ, వ్యవసాయ రంగాల సమగ్ర అభివృద్ధి కోసం CORE–PURE–RARE అనే ప్రత్యేక మోడల్‌ను అమలు చేస్తున్నామని సీఎం వివరించారు. నేటి ఏఐ యుగానికి అనుగుణంగా యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

తెలంగాణ అమలు చేస్తున్న ఆకర్షణీయమైన పారిశ్రామిక విధానాలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని, వాటిని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడానికే తాము హైదరాబాద్‌కు వచ్చామని సీఐఐ ఛైర్మన్ పునీత్ కౌరా ఈ సందర్భంగా వెల్లడించారు.

Also Read: లోకేశ్ గారూ.. కదిరి పిల్లల కష్టాలు కనిపిస్తున్నాయా?

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×