// // Illu Illalu Pillalu Today Episodes: డాక్టర్ కు నర్మద షాక్.. అయ్యో ప్రేమ అడ్డంగా ఇరుక్కుందే.. వేదవతికి నిజం తెలుస్తుందా..? -->
E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: డాక్టర్ కు నర్మద షాక్.. అయ్యో ప్రేమ అడ్డంగా ఇరుక్కుందే.. వేదవతికి నిజం తెలుస్తుందా..?

Illu Illalu Pillalu Today Episodes: డాక్టర్ కు నర్మద షాక్.. అయ్యో ప్రేమ అడ్డంగా ఇరుక్కుందే.. వేదవతికి నిజం తెలుస్తుందా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode july 2nd: డాక్టర్ దగ్గరికి వెళ్లి శ్రీవల్లి బండారం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటుంది. అయితే డాక్టర్ ని కలిసిన నర్మదా నేను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్తుంది.. మరి నువ్వు ప్రెగ్నెంట్ అని ఎలా కన్ఫర్మ్ చేసుకున్నావు కిట్టు తీసుకొని చేసుకున్నావా అని డాక్టర్ అడుగుతుంది.. లేదు నేను కళ్ళు తిరిగి కింద పడిపోతే ఒక డాక్టర్ దగ్గరికి మా వాళ్ళు తీసుకొని వెళ్లారు ఆమె నేను ప్రెగ్నెంట్ అని చెప్పింది అంతేకాదు రిపోర్ట్స్ కూడా ఇచ్చింది అని చెప్పగానే ఆ డాక్టర్ ఏంటి ఆ రిపోర్ట్స్ ఇట్లా ఇవ్వు అని అడుగుతుంది.. ఇప్పుడు చూసిన డాక్టర్ ఒక్కసారిగా షాక్ అవుతుంది.. కళ్లు తిరిగి పడిపోయింది నేను కాదు మా అక్క వల్లి.. మీరు ఈ రిపోర్ట్స్ ఇచ్చింది మా అక్కకే.. సీనియర్ డాక్టర్ అయ్యుండి బుద్ధి లేకుండా ఇలాంటి పని చేస్తారా అని నర్మదా దిమ్మ తిరిగిపోయేలా షాకిస్తుంది..  డాక్టరు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది..

కాళ్లు పట్టుకున్న డాక్టర్..

మేము మా అక్కని తీసుకొని మీ దగ్గరికి వచ్చాము.. అయితే కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు మీరు ప్రెగ్నెంట్ అని చెప్పారు.. ఆ తర్వాత మళ్లీ తను ప్రెగ్నెంట్ కాదు నిజం తెలుసుకోవాలని అక్కడికి వచ్చాము.. అప్పుడు కూడా మీరు తను ప్రెగ్నెంట్ అని రిపోర్ట్స్ కూడా ఇచ్చారు. అయితే మా అక్క ప్రెగ్నెంట్ కాదు అని మాకు తెలుసు.. మీరు ఎందుకు అబద్దం చెప్పారు ఇప్పుడు చెప్పండి లేదంటే మిమ్మల్ని పోలీసులు దగ్గరికి తీసుకొని వెళ్తాను అని నర్మదా అంటుంది.. అలాగే ఈ జిల్లా డీన్ దగ్గరికి కూడా వెళ్లి మీ హాస్పిటల్ గురించి చెప్తాము అని నర్మదా అనగానే ఆ డాక్టరు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. నేను చెప్పింది తప్పే అయితే నా కూతురు కాపురం నిలబెట్టు అని ఆ అమ్మాయి తల్లి కాళ్లు పట్టుకుంది అందుకే నేను గర్భవతి అని అబద్ధం చెప్పాను అని డాక్టర్ నిజం ఒప్పుకుంటుంది.. ఇదే విషయాన్ని మీరు నాతో పాటు వచ్చి మా ఇంట్లో చెప్తారా అని నర్మదా అడుగుతుంది.. మీ వల్ల నాకు కాపురం ఈరోజు ఇబ్బందుల్లో పడింది మిమ్మల్ని నేను ఎలా వదిలేస్తానని అనుకుంటున్నారు అని నర్మదా అంటుంది.. డాక్టర్ మాత్రం మీ కాళ్లు పట్టుకుంటాను నన్ను వదిలేయండి అని చెప్తుంది.

అబార్షన్ చేసిన డాక్టర్ కోసం నర్మదా వేట..

Advertisement

మళ్లీ రెండోసారి వచ్చినప్పుడు కూడా వల్లి నాకు కాపురాన్ని నిలబెట్టాలి లేదంటే నేను చచ్చిపోతాను అని నాకు కాళ్లు పట్టుకొని ఏడ్చింది.. అందుకే తనని గర్భవతి అని చెప్పమని రిపోర్ట్స్ ఇచ్చాను అని డాక్టర్ అంటుంది. అయినా నేనేం తప్పు చేశానని మీరు నన్ను అంటున్నారు నేను జస్ట్ ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పాను.. అంత పెద్ద మోసం చేసిన డాక్టర్ని వదిలేసి మీరు నన్ను పట్టుకున్నారు ఏంటి అని డాక్టర్ చెప్పగానే మిమ్మల్ని కాదు ఆ డాక్టర్ని కూడా బయటకు తీసుకొని వస్తాను.. ఆ డాక్టర్ పని కూడా నేను చెప్తాను అని నర్మదా డాక్టర్ కి వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తుంది.. ఎలాగైనా సరే ఈ వల్లి బాగోతాన్ని బయటపెట్టి నా తప్పేమీ లేదు అని నిరూపించుకోవాలి అని వల్లి అనుకుంటుంది.. అయితే నర్మదా వల్లిని ఎలాగైనా సరే ఇంట్లో నుంచి పంపించాలి నాకే దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుందా ఇంట్లో నా మీద చెడుగా చెప్తుందని నర్మదా ఆవేశంగా ఇంటికి వస్తుంది.

రాజాపుష్పం బుద్ధి బయటపడింది..

డాన్స్ కాంపిటీషన్ కానీ ప్రేమ రెడీ అవుతూ ఉంటుంది.. అయితే రాజు పుష్పం వచ్చి నేను రాజపుష్పాన్ని తలుపు తీయండి అని అడుగుతాడు.. డాన్స్ కోసమని ప్రేమ చాలా అందంగా రెడీ అయి ఉంటుంది.. అది చూసిన అతను నీ అందాన్ని చూసి నేను మైమర్చిపోతున్నాను. నిన్ను అస్సలు వదల బుద్ధి కావడం లేదు అని పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తాడు.. ఏం మాట్లాడుతున్నారు ముందు డాన్స్ కాంపిటీషన్ కి వెళ్ళాలి పదండి అని ప్రేమ అనగానే.. రూమ్లో రిహార్సల్స్ అయిన తర్వాతే డాన్స్ కాంపిటేషన్ అని అతను అంటాడు..అతని ప్రవర్తన చూసి బెదిరిపోయిన ప్రేమ ఎలాగైనా సరే తన నుంచి తప్పించుకోవాలని గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది.. నువ్వు ఇలాంటి వాడివని నేను అస్సలు ఊహించలేదు.. ఈరోజు వద్దన్నా సరే ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను అని ప్రేమ బాధ పడిపోతూ ఉంటుంది.. ఇక్కడ ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ లోపల గడి పెట్టుకుంటుంది.. అయితే బయట నుంచి గడి పెట్టడంతో ప్రేమ ఎటు వెళ్ళాలో అర్థం కావడం లేదు అని భయపడిపోతూ ఉంటుంది..

ధీరజ్ కు నిజం తెలుస్తుందా..?

Advertisement

ధీరజ్ ఫుడ్ డెలివరీ అని ఒక ఇంటికి వెళ్తాడు.. ఇదే అక్కడ ప్రేమ ఫ్రెండు ఉండడంతో మీ అమ్మకి హార్ట్ ఎటాక్ అని ప్రేమని తీసుకొని వచ్చావు ఇప్పుడు ఎలా ఉంది మీ అమ్మకి అని ధీరజ్ అడుగుతాడు.. అయినా ప్రేమ హాస్పిటల్ లో ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని తనపై అనుమానం వ్యక్తం చేస్తాడు ధీరజ్.. నేను వెళ్తున్నాను ఫుడ్ తీసుకుని వెళ్దామని ఆగాను అని తను పొంతన లేకుండా సమాధానం చెప్పడంతో… ధీరజ్ కి వచ్చినా అనుమానమే నిజమని అనుకుంటాడు.. తను డాన్స్ కాంపిటీషన్ కి వెళ్ళింది అని ఆమె చెప్పగానే ధీరజ్ నేను వద్దన్నా సరే తను వెళ్ళిందా అని కోపంగా ఉంటాడు.. అయితే ప్రేమకు ఫోన్ చేసి ఏమైంది అని కనుక్కుంటాడు.. అని రాజ పుష్పం మాత్రం ఆ ఫోన్ ని లాక్కొని ధీరజ్ తో మాట్లాడి ఇవ్వకుండా చేస్తాడు. ప్రేమ ధీరజ్ ని ఎలా కలవాలి ఇకనుంచి ఎలా బయటపడాలి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. ప్రేమను కాపాడడానికి ధీరజ్ వస్తాడా రాడా అన్నది చూడాలి..

నర్మదకు షాకిచ్చిన వేదవతి..

నర్మదా ఇంట్లోకి అడుగుపెట్టగానే వల్లి అంటూ కేకలు పెడుతూ లోపలికి వస్తుంది.. అక్కడ వేదవతి నర్మదా ఎందుకింత ఆవేశంగా వస్తుంది అని అనుకుంటుంది.. లోపలికి వెళ్ళగానే వేదవతి ఏంటో ఇంతగా కేకలు పెడుతూ వస్తున్నారు ఏం జరిగిందో అని అడుగుతుంది.. ఆ వల్లి కడుపుతో ఉన్నదన్న విషయాన్ని అబద్ధం చెప్పింది.. అసలు అవన్నీ నిజంగానే కడుపుతో లేదు అని ఆ డాక్టర్ చెప్పాడు మరి అబార్షన్ ఎలా అవుతుంది అని నర్మదా అంటుంది.. ఈ విషయాన్ని ఆ డాక్టర్ చెప్పిందా మరి ఆ డాక్టర్ని తీసుకురాలేదేంటి అని వేదవతి అడుగుతుంది.. అయితే నువ్వు ఇప్పుడు అబద్ధం చెప్పావని నాకు అర్థం అవుతుంది.. నువ్వు వెళ్లి ఆ డాక్టర్ని తీసుకురా అప్పుడే నేను నమ్ముతాను.. అంతేకాదు ఆ వల్లిని నేనే మెడ పట్టుకొని బయట గెంటేస్తాను లేదంటే మాత్రం నువ్వు నిజాన్ని చెప్పాలి అని వేదవతి నర్మదతో అంటుంది.. వల్లికి అబార్షన్ అయ్యింది అని చెప్పిన డాక్టర్ని ఎలాగైనా సరే పట్టుకొస్తాను అని నర్మదా అనుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: అవని త్యాగం.. కన్నీళ్లతో కాళ్లు కడిగిన శ్రీయ.. పల్లవికి మైండ్ బ్లాక్..

Related News

Today Movies in Tv : సినీ ప్రియులకు మాస్ జాతర.. శుక్రవారం టీవీల్లోకి హిట్ సినిమాలు..

Podarillu Narayana : ‘ పొదరిల్లు ‘ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. నారాయణ అవుట్..

Gundeninda GudiGantalu Today episode: చింటూ కోసం వేషం మార్చుకున్న రోహిణి.. బాలుకు అనుమానం.. అయ్యో శృతి..

Podarillu Today Episode : మహాకు అడ్డంగా దొరికిన కేశవ..హారిక మాటతో మహా షాక్.. చక్రీ, మహా విడాకులు..?

Intinti Ramayanam Today Episode: అవని త్యాగం.. కన్నీళ్లతో కాళ్లు కడిగిన శ్రీయ.. పల్లవికి మైండ్ బ్లాక్..

Illu illalu pillalu TRP Rating : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ టీఆర్పీ రేటింగ్.. జూన్ నెల హైలెట్స్..

Jagadatri Deepthi : ‘జగదాత్రి ‘ దీప్తి బ్యాగ్రౌండ్.. ఇది మాత్రం ఊహించలేదు మావా..

Big Stories

Advertisement
×