E-Paper
Advertisement

Show Cause: కాంగ్రెస్‌లో ఫోన్ ఆడియో లీక్ కలకలం.. జిల్లా అధ్యక్షుడికే షాకిచ్చిన మాజీ సర్పంచ్!

Show Cause: కాంగ్రెస్‌లో ఫోన్ ఆడియో లీక్ కలకలం.. జిల్లా అధ్యక్షుడికే షాకిచ్చిన మాజీ సర్పంచ్!
Advertisement

Show Cause: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుల ఎంపిక వ్యవహారం రోజు రోజుకు ముదురుతుంది. శుక్రవారం నేతలు రంగ ప్రవేశం చేసి అసంతృప్తులను బుబ్జగిస్తారని భావిస్తే పరిస్థితి అందుకు విరుద్ధంగా జరుగుతుంది. గుండ్లపోచంపల్లికి చెందిన నేత మీడియాతో మాట్లాడిన తీరు డీసీసీ అధ్యక్షుడికి ఆగ్రహం తెప్పించింది. షోకాజ్ నోటీసు జారీ స్థాయికి వ్యవహారం వెళ్లింది.

షోకాజ్ నోటీసు జారీ..

గుండ్లపోచంపల్లి డివిజన్ కు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ సర్పంచ్ బేరి ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ ఫోన్ స్పీకర్లో జిల్లా అధ్యక్షుడితో ఆ విషయం చెప్పకుండా మాట్లాడించారు. అంతేగాకుండా సామాజిక మాధ్యమాల్లో ఇరువురి మధ్య జరిగిన సంభాషణను ప్రచారం చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన జిల్లా అధ్యక్షుడు సర్పంచ్ బేరి ఈశ్వర్ కు శనివారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న విషయాన్ని నా ప్రమేయం లేకుండా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసి బహిర్గతం చేశారన్నారు.

Advertisement

Also read: Rythu Bharosa: 5 నుండి 6 ఎకరాలున్న రైతు ఖాతాల్లోకి.. రైతు భరోసా నిధులు విడుదల!

ఏడు రోజుల్లో వివరణ..

పీసీపీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా మీడియా ముందు సమావేశంలో ఉండి ఫోన్ స్పీకర్లో పెట్టి నాతో మాట్లాడించి, దాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టి పార్టీ విలువను తగ్గించారన్నారు. నాయకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను పార్టీ క్రమ శిక్షణా సంఘం తప్పుపడుతుందన్నారు. పార్టీ నియామవళిపై హద్దులు దాటి ప్రవర్తించినందున ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని జిల్లా అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్ షోకాజ్ నోటీసులో బేరి ఈశ్వర్‌కు సూచించారు. వివరణ సమర్పించకుంటే క్రమశిక్షణా సంఘం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుందని ఆయన హెచ్చరించారు.

Advertisement

Also read: Fake Witnesses: గద్వాల రిజిస్ట్రార్ ఆఫీస్‌లో.. సాక్షి సంతకాల దందా కలకలం!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×