E-Paper
Advertisement

మాల్దీవులు, పారిస్ కంటే ట్రెండింగ్ హనీమూన్ స్పాట్స్.. ఇక్కడి వాతావరణమే రొమాంటిక్

మాల్దీవులు, పారిస్ కంటే ట్రెండింగ్ హనీమూన్ స్పాట్స్.. ఇక్కడి వాతావరణమే రొమాంటిక్
Advertisement

పెళ్లి తర్వాత ప్రతి జంట జీవితంలో హనీమూన్ ఒక ప్రత్యేకమైన ప్రయాణం. అందుకే సరైన ప్రదేశాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. భారతీయుల్లో చాలా మంది ఇప్పటికీ పారిస్, మాల్దీవ్స్ వెళ్లడానికే ఫస్ట్ ఛాయిస్‌గా భావిస్తారు. అయితే ఇప్పుడు కొన్ని దేశాలు కూడా హనీమూన్ కోసం వేగంగా పాపులర్ అవుతున్నాయి. ప్రకృతి అందాలు, ప్రశాంత వాతావరణం, ప్రత్యేక అనుభవాలు కోరుకునే జంటలు ఈ దేశాలను ఎంచుకుంటున్నారు. ట్రిప్ బుక్ చేసుకునే ముందు ఆ దేశం గురించి పూర్తిగా తెలుసుకోవడం మంచిది. అలాగే అవసరమైన అన్ని ప్రయాణ పత్రాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలి.

గ్రీస్.. చరిత్ర, ప్రకృతి కలిసిన అందమైన దేశం

దక్షిణ యూరప్‌లో ఉన్న అద్భుతమైన దేశం గ్రీస్. ఇక్కడ అందమైన బీచ్‌లు, చారిత్రక కట్టడాలు, రుచికరమైన ఆహారం పర్యాటకులను ఆకట్టుకుంటాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో కనిపించే దృశ్యాలు ఎంతో అందంగా ఉంటాయి. కొత్త దంపతులు సముద్ర తీరంలో ప్రశాంతంగా సమయం గడపవచ్చు. ప్రపంచ ఫేమస్ బీచ్‌లతో పాటు ఎన్నో చారిత్రక ప్రదేశాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఏథెన్స్‌లోని అక్రోపోలిస్, అపోలో ఆలయం, మెటియోరా మఠాలు, కార్ఫు పాత పట్టణం తప్పక చూడాల్సిన ప్రాంతాలు. రాత్రి వేళల్లో ఇక్కడి నైట్‌లైఫ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

ఐస్‌లాండ్.. రంగులతో మెరిసేపోయే ఆకాశం

Advertisement

ప్రకృతిని ప్రేమించే జంటలకు ఐస్‌లాండ్ అద్భుతమైన హనీమూన్ గమ్యం. ఇక్కడ మంచుతో కప్పుకున్న పర్వతాలు, ప్రశాంతమైన వాతావరణం, అందమైన కేఫ్‌లు స్పెషల్ ఫీలింగ్ కలిగిస్తాయి. వరల్డ్ ఫేమస్ నార్తర్న్ లైట్స్‌ను ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు. దీన్ని ఆరోరా బోరియాలిస్ అని కూడా పిలుస్తారు. ఈ సమయంలో ఆకాశం ఆకుపచ్చ, గులాబీ, నీలం రంగులతో మెరిసిపోతుంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు.

హవాయి.. ప్రేమ, ప్రకృతిల అందమైన కలయిక

హవాయి ప్రపంచంలోని అత్యంత రొమాంటిక్ హనీమూన్ డెస్టినేషన్‌లలో ఒకటి. ఇక్కడి స్వచ్ఛమైన బీచ్‌లు, నీలిరంగు సముద్రం, పచ్చని అడవులు ప్రతి జంటను ఆకట్టుకుంటాయి. ప్రశాంత వాతావరణంలో విశ్రాంతిగా గడపడానికి ఇది అనువైన ప్రదేశం. ట్రెక్కింగ్ చేయాలనుకునే వారికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. యాక్టివ్ అగ్నిపర్వతాలను దగ్గరగా చూసే అవకాశం కూడా లభిస్తుంది. ప్రకృతి మధ్య గడిపే ప్రతి క్షణం హనీమూన్‌ను మరింత ప్రత్యేకంగా మారుస్తుంది.

Advertisement

Also Read: ఖర్చు లేకుండానే డేటింగ్ చేయాలా? తక్కువ బడ్జెట్‌లో ఇలా ప్లాన్ చేయండి

బహామాస్.. లగ్జరీ హనీమూన్‌కు బెస్ట్ ఛాయిస్

లగ్జరీ హనీమూన్ కోరుకునే జంటలకు బహామాస్ మంచి ఆప్షన్. ఈ కరీబియన్ దేశంలో అత్యాధునిక రిసార్ట్స్, అందమైన బీచ్‌లు ఉన్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే ఖర్చు ఎక్కువైనా, అక్కడి అనుభవం ప్రత్యేకంగా ఉంటుంది. హార్బర్ ఐలాండ్, పిగ్ బీచ్, ప్యారడైజ్ ఐలాండ్ వంటి ప్రాంతాలు పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. సముద్ర అందాలను ఆస్వాదిస్తూ మరపురాని క్షణాలను గడపవచ్చు.

హనీమూన్‌కు వెళ్లే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

విదేశీ ప్రయాణానికి ముందు పాస్‌పోర్ట్, వీసా వంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవాలి. వెళ్లే దేశం వాతావరణం, స్థానిక నిబంధనలు, రవాణా సౌకర్యాల గురించి ముందుగానే తెలుసుకోవాలి. అవసరమైతే భారత కరెన్సీని అక్కడి కరెన్సీతో ముందుగానే ఎక్స్‌ఛేంజ్ చేసుకోండి. ముందస్తు ప్రణాళికతో ప్రయాణిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా హనీమూన్‌ను ఎంజాయ్ చేయవచ్చు.

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×