E-Paper
Advertisement

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్ టు హౌరా, పలు రైళ్లు రద్దు

రైల్వే ప్రయాణికులకు అలర్ట్..  సికింద్రాబాద్ టు హౌరా,  పలు రైళ్లు రద్దు
Advertisement

Hyderabad: రైల్వే ప్రయాణికులు ముఖ్య గమనిక. జులై 28 నుంచి ఆగష్టు 8 తేదీ వరకు పలు రైళ్లు రద్దు అయ్యాయి. ఈ జాబితాలో సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్లే రైళ్లు ఉన్నాయి. ఖరగ్‌పూర్ డివిజన్‌లో సిగ్నలింగ్ ఆధునీకరణ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది.

రైల్వే ప్రయాణికులకు అలర్ట్

Advertisement

జులై చివరివారంలో హైదరాబాద్ నుంచి హౌరా వెళ్లే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. ఎందుకంటే ఆగ్నేయ రైల్వే పరిధిలోని ఖరగ్‌పూర్ డివిజన్‌లో బాలేశ్వర్ స్టేషన్ ఆధునీకరణ, నాన్ ఇంటర్ లాకింగ్ పనుల వల్ల సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్లే పలు రైళ్లు రద్దు చేశారు అధికారులు.

అందులో ఫలక్‌నుమా, ఈస్ట్‌కోస్ట్, షాలిమార్ రైళ్లు ఉన్నాయి. ఆ రైళ్లను ఏయే తేదీల్లో రద్దు చేశారనే వివరాలను అధికారులు ప్రకటించారు. ఆ రైళ్లలో ప్రయాణించేవారు ట్రావెలర్లు గమనించిన ముందుగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సికింద్రాబాద్- హౌరా ఫలక్‌నుమా సూపర్ ఫాస్ట్ 12704 ను జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు రద్దు చేశారు.

Advertisement

సికింద్రాబాద్ టు హౌరా, పలు రైళ్లు రద్దు

దాంతోపాటు హౌరా నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే ఫలక్‌నుమా రైలు 12703ను జూలై 29 నుంచి ఆగస్టు 9 వరకు రద్దు చేశారు అధికారులు. దీనికితోడు షాలిమార్ నుంచి చర్లపల్లికి వెళ్లే ఈస్ట్‌కోస్ట్ ఎక్స్ ప్రెస్ ఆగస్టు 4న రద్దు చేశారు. చర్లపల్లి నుంచి షాలిమార్‌కు వెళ్లే రైలు 18046ను ఆగస్టు 6న రద్దు చేసినట్టు తెలిపారు.

వీటితోపాటు రద్దయిన రైళ్లలో మరో రెండు ఉన్నాయి. షాలిమార్ -సికింద్రాబాద్ రైలు-22849ను ఆగస్టు 5న రద్దు చేశారు. సికింద్రాబాద్-షాలిమార్ రైలు-22850ను ఆగస్టు 7న రద్దు చేశారు. ఆయా మార్గాల్లో ప్రయాణించే ప్రయాణికులు తప్పనిసరిగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచన చేశారు అధికారులు. టికెట్ బుక్ చేసుకున్నవారికి రైల్వే నిబంధనల ప్రకారం రీఫండ్ లభిస్తుందని తెలియజేశారు.

ALSO READ: హైదరాబాద్ దగ్గరే మసాయి మారా అనుభూతి.. మోకిలలో కొత్త సఫారీ స్టేకేషన్!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×