E-Paper
Advertisement

Fact Check: షోయ‌బ్ అక్త‌ర్ 23 ఏళ్ల రికార్డ్ బ‌ద్ద‌లు..162 స్పీడ్ తో నహిద్ రాణా బౌలింగ్

Fact Check: షోయ‌బ్ అక్త‌ర్ 23 ఏళ్ల రికార్డ్ బ‌ద్ద‌లు..162 స్పీడ్ తో నహిద్ రాణా బౌలింగ్
Advertisement

Fact Check:  బంగ్లాదేశ్ వర్సెస్ ఆస్ట్రేలియా (Bangladesh vs Australia) మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో అద్భుతంగా రాణించిన బంగ్లాదేశ్ సిరీస్ కూడా కైవసం చేసుకుంది. దీంతో 55 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ గడ్డపై, వన్డే సిరీస్ కోల్పోయింది ఆస్ట్రేలియా. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో బంగ్లాదేశ్ డేంజర్ బౌలర్ నహీద్ రాణా (Nahid Rana ) భయంకరమైన బంతులు వేసి ఆస్ట్రేలియా బ్యాటర్లను వణికించాడు. బౌన్సర్లు, యార్కర్లు వేసి చుక్కలు చూపించాడు. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) రికార్డును నహీద్ రాణా బద్దలు కొట్టినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. 162 స్పీడ్ తో బంతులు వేశాడని ప్రచారం చేస్తున్నారు.

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

నిజంగానే షోయబ్ అక్తర్ రికార్డు బద్దలు కొట్టాడా..? వాస్తవం ఇదే

Advertisement

మొన్నటి వరకు పాకిస్తాన్ జట్టుకు చుక్క చూపించిన నహీద్ రాణా, ఇప్పుడు కంగారులకు కంగారు పెట్టిస్తున్నాడు. 150కి పైగా స్పీడుతో ప్రతి బంతి సంధిస్తున్నాడు నహీద్ రాణా. ఇక నిన్న ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండో వన్డే జరగగా లబుషేన్ కు ప్రమాదకరమైన బంతి సంధించాడు. ఇక ఈ బంతిని ఎదురుకోలేక లబుషేన్ చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఫాస్టెస్ట్ బంతుల రికార్డును నహీద్ రాణా బద్దలు కొట్టినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. నిన్నటి మ్యాచ్ సందర్భంగా 162 స్పీడుతో బంతులు సంధించాడని చర్చ జరుగుతోంది. గతంలో షోయబ్ అక్తర్ 161.3 స్పీడ్ తో బంతులు వేశాడు.

2003 ప్రపంచ కప్ సందర్భంగా ఇంగ్లాండ్పై ఈ చరిత్ర సృష్టించాడు షోయబ్ అక్తర్. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరూ కూడా ఆ రికార్డును బద్దలు కొట్టలేదు. కానీ లేటెస్ట్ గా బంగ్లాదేశ్ బౌలర్ నహీద్ రాణా బ్రేక్ చేశాడని చర్చ జరుగుతోంది. కానీ ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని నివేదికను చెబుతున్నాయి. కావాలని హైప్ కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేస్తున్నారు క్రీడా విశ్లేషకులు. నిన్న వహీదా రానా 150కి పైగా బంతులు వేశాడు తప్ప ఎక్కడ కూడా 162 స్పీడ్ తో బంతులు అందించలేదని వెల్లడిస్తున్నారు. నహీద్ రాణా హైయెస్ట్ స్పీడ్ 152 కిలో మీటర్లు అంటూ ఆధారాలు బయటపెడుతున్నారు. అంటే 23 ఏళ్ల పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ రికార్డు ఎవరు బద్దలు కొట్టలేదన్న మాట.

నహిద్ రాణాపై వ‌సీం అక్ర‌మ్ ప్ర‌శంస‌లు

Advertisement

బంగ్లా బౌల‌ర్ నహిద్ రాణాపై వ‌సీం అక్ర‌మ్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. అత‌ని బౌలింగ్ చూసి, ప్ర‌పంచ బ్యాట‌ర్లు వ‌ణికిపోతున్నార‌ని వెల్ల‌డించారు. అత‌న్ని ఎదుర్కొడం క‌ష్ట‌మే అని పేర్కొన్నారు.

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×