E-Paper
Advertisement

Iran Dubai Attack: మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్తతలు, ఈ టైమ్ లో దుబాయ్‌ కి వెళ్లడం సేఫేనా?

Iran Dubai Attack: మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్తతలు, ఈ టైమ్ లో దుబాయ్‌ కి వెళ్లడం సేఫేనా?
Advertisement

మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్‌ పై అమెరికా, ఇజ్రాయెల్ జాయింట్ గా ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నాయి. ఏకంగా ఇరాన్ సుప్రీం లీడర్ ను ఖమేనీ ఈ దాడుల్లో చనిపోయినట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో UAE తమ గగనతలాన్ని మూసివేసింది. భారత్ సహా పలు దేశాలు మిడిల్ ఈస్ట్ కు విమాన సర్వీసులను నిలిపివేశాయి.

భారత విమాన సంస్థల కీలక నిర్ణయం  

ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి అన్ని విమానాలను నిలిపివేసాయి. విమానయాన సంస్థలు అధికారికంగా ప్రకటనలు చేశాయి. తమ విమానాల స్టేటస్ ను నేరుగా వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించాయి.

Advertisement

అటు దుబాయ్ వైమానిక ప్రాంతం ప్రస్తుతం మూసివేయబడింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి  అన్ని విమానాలను నిలిపివేసాయి. ప్రయాణీకులు విమానయాన సంస్థలను సంప్రదించి విమాన స్టేటస్ ను తెలుసుకోవాలని దుబాయ్ ప్రభుత్వం సూచించింది. అదే సమయంలో DXB, DWC ఎయిర్ పోర్టులకు  వెళ్లవద్దన్నది. దుబాయ్‌ ప్రయాణానికి సంబంధించి ప్రణాళికలు ఉన్న వాళ్లు ముందుగా విమానాయాన సంస్థలతో సంప్రదించాలని సూచించింది. ఎమిరేట్స్, ఎతిహాద్, ఫ్లైదుబాయ్‌తో సహా UAE బేస్ గా సేవలు అందిస్తున్న సంస్థలు  విమానాలను నిలిపివేసాయి.

ఏ విమాన సంస్థ ఏ నిర్ణయం తీసుకుందంటే?  

ఫిబ్రవరి 28 నాటికి చాలా అంతర్జాతీయ విమానయాన సంస్థలు మిడిల్ ఈస్ట్ వైమానిక స్థావరం మూసివేత కారణంగా ప్రభావితమయ్యాయి.

Advertisement

⦿ ఎమిరేట్స్: ఎమిరేట్స్ దుబాయ్ నుంచి వచ్చే అన్ని విమానాలను నిలిపివేసింది. “మేము పరిస్థితిని  పర్యవేక్షిస్తున్నాం.  సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నాం. తాజా పరిణామాలకు అనుగుణంగా మా కార్యకలాపాలను కొనసాగిస్తాం” అని వెల్లడించింది.

⦿ ఎతిహాద్ ఎయిర్‌ వేస్: ఎతిహాద్ తన విమానాలు కూడా ప్రభావితమవుతాయని తెలిపింది. “ప్రస్తుతం పరిస్ధితి ఆందోళనకంగా ఉంది. సంబంధిత అధికారులతో సమన్వయంతో ఎతిహాద్ పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది. ప్రయాణికుల భద్రత మాకు ముఖ్యం. పరిస్థితి సురక్షితంగా ఉన్నప్పుడే విమానాలు నడుపుతాం” అని ప్రకటించింది.

⦿ ఫ్లై దుబాయ్: ఈ సంస్థ కూడా తమ విమానాలను ప్రస్తుతానికి క్యాన్సిల్ చేసినట్లు తెలిపింది. తన విమానాల షెడ్యూల్‌ ను సర్దుబాటు చేయనున్నట్లు ప్రకటించింది.

⦿ లుఫ్తాన్సా: జర్మన్ క్యారియర్ లుఫ్తాన్సా ఫిబ్రవరి 28, మార్చి 1న దుబాయ్ కి వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. టెల్ అవీవ్, బీరుట్, ఒమన్‌ కు, అక్కడి నుంచి వచ్చే అన్ని సర్వీసులను  మార్చి 7 వరకు నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

⦿ ఎయిర్ ఇండియా: దుబాయ్‌తో సహా మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి అన్ని విమానాలను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. మధ్యప్రాచ్యంలోని పరిస్థితుల దృష్ట్యా అన్ని గమ్యస్థానాలకు ఎయిర్ ఇండియా విమానాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

⦿ ఇండిగో: ఇండిగో కూడా ప్రస్తుతం దుబాయ్ కి విమాన సర్వీసులను నిలిపివేసినట్లు తెలిపింది. పరిస్థితులు కుదుటపడిన తర్వాత మళ్లీ సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది.

భారత పౌరులకు కీలక సూచనలు  

UAEలోని భారత రాయబార కార్యాలయం భారతీయులకు అడ్వయిజరీ జారీ చేసింది. ఇండియన్స్ అనవసరమైన ప్రయాణాన్ని మానుకోవాలని సూచించిది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నది. భద్రతా మార్గదర్శకాలు, సలహాలను పాటించాలన్నది.

ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్ వైమానిక ప్రాంతం మూసివేయబడింది. దుబాయ్ వైమానిక ప్రాంతం తిరిగి తెరిచినప్పుడు మాత్రమే విమాన సర్వీసులు కొనసాగే అవకాశం ఉంది. ఈ పరిస్థితులలో మిడిల్ ఈస్ట్ కు ప్రయాణాలు చేయకపోవడమే మంచిది.

Read Also: తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం.. సింపుల్ గా టికెట్లు ఇలా బుక్ చేసుకోండి!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×