E-Paper
Advertisement

Akshay Kumar: ‘సంక్రాంతికి వస్తున్నాం’ రిమేక్‌లో ఫిమేల్ లీడ్స్ వీళ్లే.. టాలీవుడ్ టాప్ బ్యూటీ..

Akshay Kumar: ‘సంక్రాంతికి వస్తున్నాం’ రిమేక్‌లో ఫిమేల్ లీడ్స్ వీళ్లే.. టాలీవుడ్ టాప్ బ్యూటీ..
Advertisement

Akshay Kumar: టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎమోషన్స్, క్రైమ్ థ్రిల్లర్ అంశాలతో రూపొందిన ఈ సినిమా దాదాపు ₹250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సూపర్ హిట్ చిత్రం బాలీవుడ్ రీమేక్‌కు సిద్ధమవుతోంది. తెలుగులో వెంకటేష్ పోషించిన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించబోతున్నారు. కామెడీ, యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన దర్శకుడు అనీస్ బజ్మీ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు.

Read also-Gandhi Talks OTT: ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ సేతుపతి కొత్త మూవీ.. కానీ చిన్న ట్విస్ట్

ఖరారైన హీరోయిన్లు!

Advertisement

ఈ ఎంటర్‌టైనర్‌లో ఇద్దరు కథానాయికలకు ప్రాధాన్యత ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. తెలుగు వెర్షన్‌లో నటించిన మీనాక్షినే హిందీ రీమేక్‌లో కూడా కథానాయికగా ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇటీవల ‘గుంటూరు కారం’, ‘లక్కీ భాస్కర్’ వంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న మీనాక్షికి ఇది బాలీవుడ్‌లో పెద్ద అవకాశం కానుంది. బిగ్ బాస్ ఫేమ్ ఆయేషా ఖాన్ మరో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ‘ఓం భీమ్ బుష్’ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఆయేషా, ఈ రీమేక్‌తో అక్షయ్ కుమార్‌ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.

Read also-Intinti Ramayanam Today Episode: మనసు మార్చుకున్న చక్రధర్.. అవనిని కూతురుగా ఒప్పుకుంటాడా..? పల్లవి నెక్స్ట్ ప్లాన్..

సినిమా నేపథ్యం

Advertisement

‘సంక్రాంతికి వస్తున్నాం’ కథ ఒక మాజీ ప్రియురాలు తన భర్త చిక్కుల్లో పడ్డాడని సహాయం కోసం మాజీ ప్రియుడైన పోలీస్ ఆఫీసర్ వద్దకు రావడంతో మొదలవుతుంది. ఈ త్రికోణ ప్రేమకథకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తోడై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హిందీ నేటివిటీకి తగ్గట్లుగా కొన్ని చిన్న మార్పులు చేసి ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్టును త్వరలోనే పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రేజీ రీమేక్ బాలీవుడ్‌లో ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×