E-Paper
Advertisement

Gandhi Talks OTT: ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ సేతుపతి కొత్త మూవీ.. కానీ చిన్న ట్విస్ట్

Gandhi Talks OTT:  ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ సేతుపతి కొత్త మూవీ.. కానీ చిన్న ట్విస్ట్
Advertisement

Gandhi Talks OTT : విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి నటించిన చిత్రం ‘గాంధీ టాక్స్’. ఎప్పుడో కనుమొరుగైన మూకీ స్టైల్ లో దీనిని తెరకెక్కించారు. జనవరి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు నెల రోజుల తర్వాత ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 1987లో వచ్చిన కమల్ హాసన్ ‘పుష్పక విమానం’ తరువాత మళ్ళీ ఇన్నాళ్లకు మాటలు లేకుండా వచ్చింది ఈ సినిమా. ఈ చిత్రం తాజాగా ఓటిటీ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అది ఏమిటి ? ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

కిషోర్ పాండురంగ్ బెలేకర్ దర్శకత్వం వహించిన ‘గాంధీ టాక్స్’ ఒక మూకీ సినిమా. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించగా, అరవింద్ స్వామి, అదితి రావు హైదరి, సిద్ధార్థ్ జాదవ్ ముఖ్య పాత్రల్లో నటించారు. AR రెహమాన్ సంగీతాన్ని అందించారు. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సొంతం చేసుకుంది. ఇది ప్రస్తుతం ‘రెంటల్’ పద్ధతిలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ సినిమాను చూడాలంటే, సబ్‌స్క్రైబర్లు కూడా అదనంగా కొంత మొత్తం చెల్లించాల్సిందే. త్వరలో ఉచితంగా స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాన ZEE5లోకూడా మార్చి 6 నుంచి స్ట్రీమింగ్ కు రానుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సమాజంలో మనుషులు డబ్బు కోసం ఎంతలా దిగజారుతారు, ఆ డబ్బు మనుషుల ప్రవర్తనను ఎలా మారుస్తుంది అనే విషయాన్ని దర్శకుడు చాలా వెటకారంగా చూపించారు. ముంబైలో ఉండే మహదేవ్ (విజయ్ సేతుపతి) అనే యువకుడి చుట్టూ కథ తిరుగుతుంది. అతను బాగా చదువుకున్నా కూడా ఉద్యోగం లేక ఇబ్బంది పడుతుంటాడు. ఎలాగైనా ఒక పెద్ద కంపెనీలో సెటిల్ అయ్యి తన కష్టాలన్నీ తీర్చుకోవాలని కలలు కంటాడు. చివరికి మున్సిపాలిటీలో ఉద్యోగం‌ కోసం ప్రయత్నించగా అక్కడ కూడా ఎక్కువ మొత్తంలో లంచం అడుగుతారు. ఆ డబ్బు కోసం నిజాయితీని పక్కకు పెట్టి మోసాలకు రెడీ అవుతాడు.

మరోవైపు అదే ముంబైలో బోస్‌మన్‌ (అరవింద్‌ స్వామి) వ్యాపారంలో నష్టం రావడంతో రోడ్డున పడుతాడు. ఇద్దరూ కూడా ఒక చోట కలుసుకుంటారు. ఇక ఈ కష్టాల నుంచి బయటపడేందుకు వీళ్ళు ఎలాంటి ప్లాన్‌ వేశారు ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం నటీనటుల ముఖ కవళికలు, ఏఆర్ రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్ తోనే కథ మొత్తం సాగుతుంది.

Advertisement

Read Also : డబ్బు కోసం ఎంతకైనా… మైండ్ బ్లాక్ చేసే మోసాలు… ఫ్యూజులు అవుటయ్యే క్లైమాక్స్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×