E-Paper
Advertisement

మాన్సూన్ ట్రిప్‌ కు బెస్ట్ ఛాయిస్.. తెలంగాణలో ఈ 8 ప్లేస్‌లు మిస్ కావొద్దు!

మాన్సూన్ ట్రిప్‌ కు బెస్ట్ ఛాయిస్.. తెలంగాణలో ఈ 8 ప్లేస్‌లు మిస్ కావొద్దు!
Advertisement

Best Monsoon Destinations in Telangana: వర్షాలు మొదలైతే తెలంగాణలో ప్రకృతి మరింత కనువిందు చేస్తుంది. కొండలు పచ్చని దుప్పటి కప్పుకున్నట్లు కనిపిస్తాయి. జలపాతాలు ఉరకలెత్తుతాయి. అడవులు కొత్త అందాన్ని సంతరించుకుంటాయి. వీకెండ్‌ లో కుటుంబంతో, స్నేహితులతో చిన్న ట్రిప్ ప్లాన్ చేస్తున్నవారికి తెలంగాణలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. అందులో తప్పక చూడాల్సిన కొన్ని బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.బొగత జలపాతం: ములుగు జిల్లా

తెలంగాణ నయాగరాగా పేరొందిన బొగత జలపాతం వర్షాకాలంలో మరింత అందంగా కనిపిస్తుంది. దట్టమైన అడవుల మధ్య నుంచి ఉధృతంగా కిందికి దూసుకొచ్చే నీటి ప్రవాహం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ప్రకృతి ప్రేమికులకు ఇది బెస్ట్ డెస్టినేషన్.

2.కుంతాల, పొచ్చెర జలపాతాలు: ఆదిలాబాద్ జిల్లా

Advertisement

తెలంగాణలోనే అత్యంత ఎత్తైన జలపాతం కుంతాల. వర్షాకాలంలో దీని అందం రెట్టింపవుతుంది. సమీపంలో ఉన్న పొచ్చెర జలపాతం కూడా విశాలమైన రాతి నిర్మాణాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ రెండు ప్రదేశాలు ఫోటోగ్రఫీకి కూడా అద్భుతంగా ఉంటాయి.

3.అనంతగిరి కొండలు: వికారాబాద్ జిల్లా

హైదరాబాద్‌కు సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి హిల్స్ వర్షాల్లో మరింత పచ్చగా మారిపోతాయి. పొగమంచు, చల్లని గాలి, అడవి అందాలు కలిసి ప్రశాంతమైన అనుభూతిని కలిగిస్తాయి. వీకెండ్ ట్రిప్‌ కు ఇది బెస్ట్ ప్లేస్.

4.నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లా

Advertisement

వర్షాలు బాగా కురిసిన తర్వాత నాగార్జునసాగర్ గేట్లు ఎత్తితే ఆ దృశ్యం చూడటానికి వేలాది మంది వస్తుంటారు. సమీపంలోని ఎత్తిపోతల జలపాతం కూడా ఈ సీజన్‌లో మరింత ఉత్సాహంగా ప్రవహిస్తుంది. కుటుంబంతో వెళ్లడానికి ఇది బెస్ట్ ప్లేస్ గా చెప్పుకోవచ్చు.

5.శ్రీశైలం

నల్లమల అడవుల గుండా సాగే ఘాట్ రోడ్ ప్రయాణం వర్షాకాలంలో మరపురాని అనుభూతిని ఇస్తుంది. దట్టమైన అడవులు, మేఘాలతో కప్పుకున్న కొండలు, కృష్ణా నది అందాలు కలిసి ఈ ప్రయాణాన్ని ప్రత్యేకంగా మారుస్తాయి.

6 సోమశిల: నాగర్‌ కర్నూల్ జిల్లా

ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతిని ఆస్వాదించాలనుకునేవారికి సోమశిల మంచి స్పాట్. సాగర్ బ్యాక్‌ వాటర్స్, పచ్చని కొండలు, చల్లని వాతావరణం ఈ ప్రాంతాన్ని వర్షాకాలంలో మరింత అందంగా మారుస్తాయి.

7.రామప్ప ఆలయం, వరంగల్ జిల్లా

చరిత్రను ఇష్టపడేవారు వరంగల్‌లోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని తప్పకుండా సందర్శించాలి. వర్షాకాలంలో ఆలయం చుట్టూ ఉన్న చెరువులు, పచ్చని పరిసరాలు అద్భుతంగా కనిపిస్తాయి.

8.గోల్కొండ కోట, హైదరాబాద్

ఇక హైదరాబాద్‌లోని గోల్కొండ కోటపై నుంచి వర్షంలో నగరాన్ని చూడటం కూడా ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. వర్షాకాలంలో కోట అంతా పచ్చగా కనువిందు చేస్తూ, పర్యాటకులను ఆకట్టుకుంటుంది. వర్షాకాలంలో తెలంగాణ ప్రకృతి ప్రేమికులకు నిజమైన స్వర్గంలా మారిపోతుంది. జలపాతాల గర్జన, పచ్చని అడవులు, చల్లని వాతావరణం, చారిత్రక కట్టడాల అందాలు.. ఒకే ట్రిప్‌లో ఆస్వాదించాలంటే ఈ ప్రదేశాలను మీ ట్రావెల్ లిస్ట్‌ లో తప్పకుండా చేర్చుకోవచ్చు.

Read Also: జస్ట్ రూ.23 వేలకే.. రౌండ్ ట్రిప్, ఆగస్టులో ఈ ప్రాంతాలకు వెళ్లి వచ్చేయండి!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×