// // ATM లో డెబిట్ కార్డ్ ఇరుక్కుపోతే ఏం చేయాలి? ఈ సింపుల్ ట్రిక్స్ మీ కోసమే! -->
E-Paper
Advertisement

ATMలో కార్డ్ ఇరుక్కుపోయిందా? కంగారు వద్దు మామ.. వెంటనే ఇలా చేయండి!

ATMలో కార్డ్ ఇరుక్కుపోయిందా? కంగారు వద్దు మామ.. వెంటనే ఇలా చేయండి!
Advertisement

ATM Card: బ్యాంకుకు వెళ్లే పని లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎంలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే కొన్నిసార్లు ఏటీఎం సెంటర్‌కు వెళ్లినప్పుడు ఊహించని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అందులో ముఖ్యమైనది.. ఏటీఎం మిషన్‌లో డెబిట్ కార్డ్ (ATM Card) ఇరుక్కుపోవడం. కార్డ్ లోపలే ఉండిపోతే ఏం చేయాలో పాలుపోక చాలామంది కంగారుపడిపోతుంటారు. ఇలాంటి సమయంలో అస్సలు పానిక్ అవ్వకుండా వెంటనే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, అత్యవసర చర్యల గురించి ఈ కథనంలో చూద్దాం.

కంగారు వద్దు.. క్యాన్సిల్ నొక్కు

డెబిట్ కార్డ్ ఏటీఎం లోపల ఇరుక్కుపోగానే మొదట కీప్యాడ్‌పై ఉండే ‘Cancel’ లేదా ‘Clear’ బటన్‌ను గట్టిగా నొక్కాలని నిపుణులు సూచిస్తున్నారు. బటన్ నొక్కి కొన్ని సెకన్ల పాటు వేచి చూడాలని సూచిస్తున్నారు. కొన్నిసార్లు సర్వర్ నెమ్మదించడం వల్ల, సాంకేతిక లోపం వల్ల ట్రాన్సాక్షన్ ఆలస్యం కావచ్చు. క్యాన్సిల్ బటన్ నొక్కడం ద్వారా ఆ ప్రక్రియ రద్దయి, కార్డ్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అప్పటికీ రాకపోతే స్క్రీన్‌పై ఎలాంటి మెసేజ్ వస్తుందో గమనించాలని సూచిస్తున్నారు.

పిన్ నంబర్ ఎవరికీ చెప్పొద్దు

Advertisement

సాధారణంగా కార్డు ఇరుక్కుపోతే.. ఏటీఎం సెంటర్ లో ఉన్న ఇతర వ్యక్తుల సాయాన్ని కొందరు కోరుతుంటారు. ఈ క్రమంలో పిన్ నెంబర్ ను ఎవరితోనూ షేర్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. కొంతమంది మోసగాళ్లు సహాయం చేస్తున్నట్లు నటిస్తూ పిన్ నంబర్ తెలుసుకుని, మీరు వెళ్లిన తర్వాత కార్డ్ దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు

ఏటీఎం మిషన్ నుండి కార్డ్ ఎంతకూ బయటకు రాకపోతే వెంటనే సంబంధిత బ్యాంక్ కస్టమర్ కేర్ (Customer Care) నంబర్‌కు ఫోన్ చేయండి. వారికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించండి. ఏటీఎం ఏ ప్రాంతంలో ఉంది? ఏ సమయానికి కార్డ్ ఇరుక్కుపోయింది? వంటి వివరాలను వారికి అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.

కార్డ్‌ను ‘బ్లాక్’ చేయండి

Advertisement

కస్టమర్ కేర్ ప్రతినిధితో మాట్లాడేటప్పుడే కార్డును బ్లాక్ చేయమని చెప్పాలని నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల కార్డ్ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉండదని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ మొబైల్‌లో బ్యాంకింగ్ యాప్ ఉంటే స్వయంగా లాగిన్ అయ్యి ‘Manage Cards’ ఆప్షన్ ద్వారా కార్డ్‌ను వెంటనే బ్లాక్ చేసుకోవచ్చని వివరిస్తున్నారు.

Also Read: వాషింగ్ మిషన్‌లో బకెట్ వేడి నీళ్లు.. తర్వాత జరిగే అద్భుతం ఇదే!

హోమ్ బ్రాంచ్‌కు వెళ్లడం

కార్డ్ ఉపయోగించిన ఏటీఎం ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌కు అనుసంధానమై ఉంటే నేరుగా బ్యాంక్ మేనేజర్‌ను కలవాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడు ఏటీఎం మెయింటెనెన్స్ సిబ్బంది మిషన్‌ను తెరిచినప్పుడు కార్డ్‌ను వారు భద్రపరుస్తారని పేర్కొంటున్నారు. తర్వాత మీ గుర్తింపు కార్డులను పరిశీలించి.. ఇచ్చేస్తారని తెలియజేస్తున్నారు. ఒకవేళ వేరే బ్యాంకు ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోతే.. హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి కొత్త కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిదని వివరిస్తున్నారు.

Also Read: జియో ఎగిరిగంతేసే ప్లాన్.. కేవలం రూ.55 కే 1,000+ ఛానళ్లు.. ఏమేం చూడొచ్చో తెలుసా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×