E-Paper
Advertisement

వాషింగ్ మిషన్‌లో బకెట్ వేడి నీళ్లు.. తర్వాత జరిగే అద్భుతం ఇదే!

వాషింగ్ మిషన్‌లో బకెట్ వేడి నీళ్లు.. తర్వాత జరిగే అద్భుతం ఇదే!
Advertisement

Washing Machine Tips: ఇంట్లో ప్రతీ రోజూ తప్పనిసరిగా జరిగే పనుల్లో బట్టలు ఉతకడం ఒకటి. అయితే చాలా మంది వాషింగ్ మిషన్ లో వేసిన బట్టలు శుభ్రంగా మారడానికి ఖరీదైనా డిటర్జెంట్లు వాడుతుంటారు. అయినప్పటికీ, కొన్నిసార్లు బట్టలు ఆరిన తర్వాత కూడా ఒక రకమైన మురికి వాసన వస్తూనే ఉంటుంది. దీనికి కారణం వాషింగ్ మిషన్ లో పెద్ద ఎత్తున పేరుకుపోయిన బ్యాక్టీరియా అని నిపుణులు అంటున్నారు. అయితే దీనికి పైసా ఖర్చులేకుండా సులువుగా చెక్ పెట్టొచ్చని పేర్కొంటున్నారు. బకెట్ వేడి నీటిని ఉపయోగించడం ద్వారా బట్టలను బ్యాక్టీరియా రహితంగా, సువాసనభరితంగా ఎలా మార్చుకోవచ్చో ఈ కథనంలో చూద్దాం.

అసలు దుర్వాసనకు కారణం ఏంటి?

వాషింగ్ మిషన్ లో బట్టలు ఉతికేటప్పుడు సాధారణంగా చల్లటి నీటినే వాడుతుంటారు. దీనివల్ల బట్టలపై ఉండే జిడ్డు, చెమట, డిటర్జెంట్ మురికి పూర్తిగా వదిలిపోకుండా వాషింగ్ మిషన్ డ్రమ్ లోపలి భాగాల్లో పేరుకుపోతాయి. కాలక్రమేణా అక్కడ ‘బయోఫిల్మ్’ అనే జిగట పొర ఏర్పడి బ్యాక్టీరియా, బూజు (Mold) పెరగడానికి కారణమవుతుంది. ఆ సమయంలో బట్టలు మిషన్ లో వేసినప్పుడు అవి వాటికి అంటుకొని దుర్వాసన రావడం జరుగుతుందని నిపుణులు అంటున్నారు.

వేడి నీరు ఎలా పనిచేస్తుంది?

Advertisement

వాషింగ్ మిషన్ సైకిల్ ప్రారంభించే ముందు లేదా మెషీన్ టబ్ క్లీనింగ్ చేసేటప్పుడు ఒక బకెట్ బాగా కాగిన వేడి నీటిని (సుమారు 60°C నుండి 90°C) అందులో పోస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రత కలిగిన వేడి నీరు.. బట్టల్లో దాగి ఉన్న 99% బ్యాక్టీరియా, కంటికి కనిపించని వైరస్‌లు, అలర్జీ కారకాలను సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. కాలర్‌ల దగ్గర ఉండే మొండి జిడ్డు, నూనె మరకలు చల్లటి నీటి కంటే వేడి నీటిలో చాలా వేగంగా కరిగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

మిషన్ మన్నికకు బూస్టప్

ఒక్క బకెట్ వేడి నీరు.. బట్టలతో పాటు వాషింగ్ మిషన్ ను సైతం శుభ్రం చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. మిషన్ పైపుల్లో, డ్రమ్ వెనుక భాగంలో పేరుకుపోయిన డిటర్జెంట్ పౌడర్, గట్టిపడిన మురికిని ఈ వేడి నీరు కరిగించి బయటకు పంపేస్తుందని పేర్కొంటున్నారు. దీనివల్ల మిషన్ లోపల బ్యాక్టీరియా చేరకుండా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అలాగే వాషింగ్ మిషన్ లైఫ్ స్పామ్ కూడా పెరుగుతుందని వివరిస్తున్నారు.

Advertisement

Also Read: జియో ఎగిరిగంతేసే ప్లాన్.. కేవలం రూ.55 కే 1,000+ ఛానళ్లు.. ఏమేం చూడొచ్చో తెలుసా?

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

వాషింగ్ మిషన్ లో వేడి నీటిని ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. కాటన్ బట్టలు, బెడ్ షీట్లు, టవల్స్ వంటి వాటికి వేడి నీరు చాలా మంచిదని పేర్కొంటున్నారు. అయితే పట్టు (Silk), ఉన్ని (Woolen), రంగులు వెలిసిపోయే డెలికేట్ దుస్తులకు వేడి నీటిని అస్సలు వాడొద్దని హితవు పలుకుతున్నారు. అయితే ప్రతీరోజూ వేడి నీటితో బట్టలు ఉతికాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. వారానికి ఒకసారైనా వేడి నీటితో బట్టలు ఉతకడం లేదా బట్టలు లేకుండా వేడి నీరు, కొద్దిగా వినెగార్/బేకింగ్ సోడా వేసి ‘టబ్ క్లీన్’ చేయడం అలవాటు చేసుకోవాలని హితవు పలుకుతున్నారు.

Also Read: హాట్ పిక్స్ కావాలా? …ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్‌పై పాయల్ రాజ్‌పుత్ స్ట్రాంగ్ కౌంటర్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×