E-Paper
Advertisement

క్యూఆర్ కోడ్ మూలల్లో.. ఆ నల్లటి డబ్బాలు ఎందుకు ఉంటాయో తెలుసా?

క్యూఆర్ కోడ్ మూలల్లో.. ఆ నల్లటి డబ్బాలు ఎందుకు ఉంటాయో తెలుసా?
Advertisement

QR Code Secrets: ప్రస్తుతం ఎక్కడ చూసినా క్యూర్ కోడ్ (QR Code) స్కానర్లే దర్శనమిస్తున్నాయి. స్కాన్ చేయడం ద్వారా సెకన్లలో లావాదేవీలు పూర్తవుతున్నాయి. అయితే ఈ QR కోడ్‌ ప్లేట్ ను ఎప్పుడైనా గమనిస్తే.. దాని మూడు మూలల్లో పెద్ద నల్లటి చతురస్కారాపు బాక్సులు కనిపిస్తుంటాయి. నాల్గో మూల మాత్రం ఎలాంటి బాక్స్ లేకుండా సాధారణం గీతలతో ఉండిపోతుంది. అసలు ఆ మూడు బాక్సుల వెనుక ఉన్న రహస్యం ఏంటి? వాటిని దేని కోసం డిజైన్ చేశారు? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

పొజిషన్ డిటెక్షన్ ప్యాటర్న్

ఆ మూడు చతురస్రాలను సాంకేతిక భాషలో ‘పొజిషన్ డిటెక్షన్ ప్యాటర్న్స్’ అని పిలుస్తారు. మీరు కెమెరాను ఏ కోణంలో (Cross, Upside Down, Straight) ఉంచి స్కాన్ చేసినా.. ఆ మూడు బాక్స్ లు సరైన దిశ ఏంటో తెలియజేస్తాయి. ఫోన్ ఏ యాంగిల్‌లో ఉన్నా సెకను కంటే తక్కువ సమయంలో కోడ్‌ను సరిగ్గా చదవడానికి ఇవి ఉపయోగపడనున్నాయి.

నాల్గో మూల ఖాళీ ఎందుకు?

Advertisement

మూడు మూలల్లో చతురస్ర బాక్స్ లు ఉండటం వల్ల కోడ్ పెర్ఫెక్ట్ పొజిషన్ ను కెమెరా గుర్తించగల్గుతుంది. ఒకవేళ నాల్గో మూలలో కూడా బాక్స్ ఉంటే.. కోడ్ నేరుగా ఉందో లేదా తలకిందులుగా ఉందో గుర్తించడంలో స్కానర్ గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. నాల్గో మూలలో బాక్స్ లేకపోవడం వల్ల.. కోడ్ కు సంబంధించిన టాప్-లెఫ్ట్, టాప్-రైట్, బాటమ్-లెఫ్ట్ భాగాలను కెమెరా స్పష్టంగా గుర్తించగలదు.

ఇంతకీ క్యూఆర్ కోడ్ ఎలా పుట్టింది?

1994లో జపాన్‌కు చెందిన ‘డెన్సో వేవ్’ (Denso Wave) సంస్థ ఆటోమొబైల్ పార్ట్‌లను వేగంగా ట్రాక్ చేయడానికి దీనిని క్యూఆర్ కోడ్ ను డిజైన్ చేసింది. సాధారణ బార్‌కోడ్‌ల కంటే 100 రెట్లు వేగంగా.. అత్యధిక సమాచారాన్ని స్టోర్ చేసుకునేలా వీటికి రూపకల్పన చేసింది. కాలక్రమేణా అది ఆర్థిక రంగంలోకి విస్తరించి.. యూపీఐ పేమెంట్లకు కీలకంగా మారిపోయాయి.

Advertisement

Also Read: ‘భోగాపురం’ అంటే ఏంటీ? ఆ పేరు ఎలా వచ్చింది? ఈ ఊరికి ఇంత చరిత్ర ఉందా?

దుమ్ము ధూళి ఉన్నా నో ప్రాబ్లం

టీకొట్టు, కిరాణా షాప్స్, మాల్స్ లో కనిపించే క్యూఆర్ కోడ్‌లో ‘ఎర్రర్ కరెక్షన్’ (Error Correction) సాంకేతికత ఇన్ బిల్ట్ గా ఉంటుంది. దీనివల్ల క్యూఆర్ కోడ్ పై కాస్త దుమ్ము పడినా, 30% వరకు చిరిగిపోయినా కూడా ఆ మూడు చతురస్రాల సహాయంతో కెమెరా మిగిలిన డేటాను సరిగ్గా అంచనా వేసి స్కాన్ చేయగలదని నిపుణులు చెబుతున్నారు.

Also Read: ప్రధానిని తిడుతుంటే.. చాలా బాధపడ్డా.. పవన్ కళ్యాణ్ భావోద్వేగం!

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×