E-Paper
Advertisement

Bolla Brahma Naidu Arrest: చిక్కిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. తమిళనాడులో బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Bolla Brahma Naidu Arrest: చిక్కిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. తమిళనాడులో బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Advertisement

Bolla Brahma Naidu Arrest: ఎట్టకేలకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్‌ అయ్యారు. కొన్నాళ్లు పరారీలో ఉన్న ఆయన కోసం హైదరాబాద్ పోలీసులు గాలింపు చేపట్టారు. చివరకు తమిళనాడులో అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్‌ కు ఆయన్ని తీసుకొచ్చారు అధికారులు.

తమిళనాడులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Advertisement

హైదరాబాద్‌‌లోని గండిపేట ప్రాంతంలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కాజేసేందుకు నకిలీ జీవోలు సృష్టించారు. ఈ యవ్వారానికి తెర వెనుక బ్రహ్మనాయుడు మంత్రాంగం నడిపించినట్లు పోలీసుల విచారణలో తేలింది. రంగారెడ్డి జిల్లా గండిపేటలోని సర్వే నంబరు-18లో ప్రభుత్వ భూమికి సంబంధించి నకిలీ జీవోల తయారీ, ఆ ప్రతులను సోష్ మీడియాలో ప్రచారం చేయడం వెనుక బ్రహ్మనాయుడు పాత్ర ఉన్నట్లు నిర్ధారించారు.

ఆయన ఖాతా నుంచి రూ.1.25 కోట్ల బదిలీ అయినట్టు తేలింది. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు కుట్ర పన్నిన కేసులో బ్రహ్మనాయుడు సహా 9 మందిపై కేసులు నమోదయ్యాయి సైబరాబాద్ పోలీసులు. ఇటీవల సైబరాబాద్‌ పోలీసులు నరసరావుపేటలో బ్రహ్మనాయుడు నివాసంలో సోదాలకు వెళ్లారు.

Advertisement

తమిళనాడు నుంచి హైదరాబాద్ తీసుకొచ్చిన సైబరాబాద్ పోలీసులు

ఆయన ఇంటిలో అందుబాటులో లేరు. ఆయనతోపాటు మిగతా నిందితులు బొల్లా రమేశ్, కొవ్వూరు సునీల్ ఇంకా ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి ఆచూకీ తీసిన పోలీసులకు హైదరాబాద్, కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు వెళ్లినట్లు గుర్తించారు. శుక్రవారం తమిళనాడులోని కాంచీపురంలో బొల్లాబ్రహ్మనాయుడిని అరెస్ట్‌ చేశారు సైబరాబాద్ పోలీసులు.

బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ కావడంతో ప్రభుత్వ భూములపై కన్నేసిన తెరవెనుక పాత్ర, సూత్రదారులు ఎవరన్నది తేలిపోనుంది.  ప్రధాన వ్యక్తి అరెస్టు కావడంతో మిగతా నిందితులు ఆలోచనలో పడ్డారు. అంతేకాదు దీని వెనుక అసలు సూత్రదారులకు టెన్షన్ మొదలైంది. పోలీసుల విచారణలో బ్రహ్మనాయుడు ఇంకెన్ని కొత్త విషయాలు బయటపెడతారో చూడాలి.

ALSO READ: కేటీఆర్‌పై వ్యాఖ్యలా? ఒళ్ళు దగ్గర పెట్టుకో కడియం.. డాక్టర్ రాజయ్య హెచ్చరిక

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×