// // Viral Bike Challenge: తలకిందులుగా వేలాడితే ఫ్రీ బైక్.. వైరల్ అవుతున్న షోరూమ్ ఛాలెంజ్! -->
E-Paper
Advertisement

తలకిందులుగా వేలాడితే ఫ్రీ బైక్.. వైరల్ అవుతున్న షోరూమ్ ఛాలెంజ్!

తలకిందులుగా వేలాడితే ఫ్రీ బైక్.. వైరల్ అవుతున్న షోరూమ్ ఛాలెంజ్!
Advertisement

Viral Motorcycle Challenge: బైక్ ఉచితంగా కావాలా? అయితే 10 నిమిషాలు తలకిందులుగా వేలాడాలి! వినడానికి వింతగా అనిపించినా, బ్రెజిల్‌ లో జరిగిన ఓ ప్రచార కార్యక్రమం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక మోటార్‌ సైకిల్ షోరూమ్ వినియోగదారులను ఆకర్షించేందుకు నిర్వహించిన ఈ ప్రత్యేక ఛాలెంజ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే?

సాధారణంగా షోరూమ్‌లు డిస్కౌంట్లు, క్యాష్‌ బ్యాక్‌ లు, బహుమతులతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి. కానీ, బ్రెజిల్‌లోని ఒక బైక్ డీలర్ మాత్రం అందరికీ భిన్నంగా ఆలోచించాడు. ఎవరైనా 10 నిమిషాల పాటు బైక్ ను పట్టుకుని తలకిందులుగా వేలాడగలిగితే వారికి ఉచితంగా కొత్త మోటార్‌ సైకిల్ ఇస్తామని ప్రకటించాడు. ఈ ఛాలెంజ్ కోసం షోరూమ్‌లో ఓ మోటార్‌ సైకిల్‌ ను తలకిందులుగా వేలాడదీశాడు. ఈ ఛాలెంజ్ లో పాల్గొనేవారు ఆ బైక్‌ను పట్టుకుని తలకిందులుగా వేలాడాల్సి ఉంటుంది. ఛాలెంజ్ పూర్తి చేస్తే కొత్త బైక్‌ ను గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఈ పోటీలో పాల్గొనేందుకు పలువురు యువకులు వచ్చారు. చాలా వరకు ఫెయిల్ అయ్యారు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి.

క్రేజీగా రియాక్ట్ అవుతున్న నెటిజన్లు

Advertisement

వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఇది చాలా సరదాగా ఉందని కామెంట్ చేస్తుంటే, మరికొందరు బైక్ గెలవాలంటే ఇప్పుడు జిమ్నాస్ట్‌ లా ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుందని చమత్కరిస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఇలాంటి వినూత్న మార్కెటింగ్ ఆలోచనలను మెచ్చుకుంటున్నారు.

Advertisement

అయితే, ఈ సవాల్ కేవలం వినోదం కోసమే కాకుండా, షోరూమ్‌ కు భారీ ప్రచారం తీసుకొచ్చింది. సాధారణంగా పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చినా రాని గుర్తింపు, ఈ ఒక్క వీడియోతో దక్కిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా యుగంలో సృజనాత్మక ఆలోచనలు ఎంత వేగంగా ప్రజల్లోకి వెళ్తాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది.

వాస్తవానికి 10 నిమిషాల పాటు తలకిందులుగా వేలాడటం అంత సులభమైన పని కాదు. దీనికి మంచి శారీరక దృఢత్వం, కాన్సంట్రేషన్ అవసరం. అందుకే చాలామంది ఈ ఛాలెంజ్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు మాత్రం బైక్ కోసం ఇంత రిస్క్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా, ఈ వినూత్న ప్రచార కార్యక్రమం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బైక్ గెలుచుకోవాలంటే తలకిందులుగా వేలాడాలనే ఆలోచన వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ, అదే ఈ ప్రచారాన్ని వైరల్ చేసింది. మార్కెటింగ్‌ లో కొత్త ఆలోచనలు ఎంత ప్రభావం చూపగలవో ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది.

Read Also: జూపిటర్ CNG To అపాచీ RR 450.. టీవీఎస్ నుంచి రాబోతున్న క్రేజీ మోడల్స్ ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×