E-Paper
Advertisement

షావోమి అధునాతన ‘FX Mini LED’ టీవీలు.. ఆశ్చర్యపరిచే ఫీచర్లు.. భారీ స్క్రీన్‌పై విజువల్స్ పండగ!

షావోమి అధునాతన ‘FX Mini LED’ టీవీలు.. ఆశ్చర్యపరిచే ఫీచర్లు.. భారీ స్క్రీన్‌పై విజువల్స్ పండగ!
Advertisement

Xiaomi TV: ప్రముఖ టెక్ దిగ్గజం షావోమి (Xiaomi) భారతీయ వినియోగదారుల కోసం సరికొత్త ‘షావోమి టీవీ FX మినీ ఎల్ఈడీ’ (Xiaomi TV FX Mini LED) సిరీస్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రీమియం హోమ్ థియేటర్ అనుభూతిని అందించే లక్ష్యంతో అదిరిపోయే ఫీచర్లతో ఈ స్మార్ట్ టీవీలను గురువారం దేశీయ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ అధునాత టీవీ సిరీస్ ధరలు, ప్రధాన ఫీచర్లు, ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో చూద్దాం.

4K అల్ట్రా HD స్క్రీన్

షావోమీ తన ‘షావోమి టీవీ FX మినీ ఎల్ఈడీ’ సిరీస్ ను మొత్తం నాలుగు సైజుల్లో లాంచ్ చేసింది. 43, 55, 65, 75 అంగుళాల స్క్రీన్ వేరియంట్లలో దీనిని తీసుకొచ్చింది. ఇవన్నీ 4K అల్ట్రా HD రిజల్యూషన్‌ను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో వాడిన క్వాంటం మ్యాజిక్ (Quantum MagiQ), ఫుల్-అరే మినీ ఎల్ఈడీ టెక్నాలజీ వల్ల స్క్రీన్ పై రంగులు ఎంతో స్పష్టంగా, సహజంగా కనిపిస్తాయని షావోమీ పేర్కొంది.

గేమర్ల కోసం ప్రత్యేక ఫీచర్లు

Advertisement

పెద్ద స్క్రీన్ వేరియంట్లయిన 55, 65, 75 ఇంచ్ మోడళ్లలో గేమింగ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా 120Hz రిఫ్రెష్ రేట్ (DLG 120Hz Game Mode)ను అందించారు. దీనివల్ల హై గ్రాఫిక్స్ గేమ్‌లు ఆడుతున్నప్పుడు ఎలాంటి లాగ్ లేకుండా స్క్రీన్ చాలా స్మూత్‌గా రన్ అవుతుందని షావోమీ వర్గాలు తెలిపాయి.

ఇన్ బిల్ట్ ఫైర్ టీవీ

ఈ స్మార్ట్ టీవీలు అమెజాన్ ఫైర్ టీవీ (Fire TV) ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తాయని షావోమీ తెలిపింది. దీని ద్వారా నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి 12,000 కంటే ఎక్కువ యాప్స్‌ను సులభంగా యాక్సెస్ చేయవచ్చని పేర్కొంది. అలాగే అలెక్సా (Alexa) వాయిస్ కంట్రోల్ సపోర్ట్ కూడా ఈ షావోమీ టీవీలు కలిగి ఉన్నాయి.

Advertisement

Also Read: కాలం మారిందోచ్.. ఇక వర్షాకాలంలో వెచ్చగా ఉంచే.. టాప్ 5 ఏసీలు ఇవే..!

ధరకు తగ్గట్టుగా ఆఫర్లు

భారత్‌లో ఈ టీవీల అసలు ధరలు రూ.32,999 (43 అంగుళాలు) నుండి ప్రారంభమై రూ.84,999 (75 ఇంచ్) వరకు ఉన్నాయి. అయితే పరిమిత కాల లాంచ్ ఆఫర్ కింద రూ. 3,000 వరకు తగ్గింపును షావోమీ ఇస్తోంది. ఫలితంగా ప్రారంభ మోడల్‌ను కేవలం రూ.29,999కే కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు. జూన్ 11 నుండి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, షావోమి అధికారిక వెబ్‌సైట్లలో ఈ టీవీలు అందుబాటులోకి వస్తాయని షావోమీ ప్రకటించింది.

Also Read: వానలు వచ్చేస్తున్నాయ్.. ఏసీలో ఈ సెట్టింగ్స్ మారిస్తే.. ఇక వర్షాకాలంలోనూ హాయిగా ఉండొచ్చు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×