E-Paper
Advertisement

Bandi Sanjay: కవితకు బెయిల్ రావడంపై బండి సంజయ్ రియాక్షన్.. సోషల్ మీడియాలో ట్వీట్

Bandi Sanjay: కవితకు బెయిల్ రావడంపై బండి సంజయ్ రియాక్షన్.. సోషల్ మీడియాలో ట్వీట్
Advertisement

Bandi Sanjay Comments on Congress and BRS Parties: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కవిత బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నం చేశారు. పలు దఫాలుగా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా ఆమెకు బెయిల్ మంజూరు కాలేదు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానే కాదు.. దేశ వ్యాప్తంగా భారీగా చర్చ కొనసాగింది. ఇంతకు ఆమెకు జైలు వస్తుందా ? రాదా ? అంటూ జనాలు భారీగా చర్చించారు.

ఇటీవల రాఖీ పండుగ కవితను గుర్తు చేసుకుంటూ తన అన్నయ్య, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ భావోద్వేగ ట్వీట్ కూడా చేశారు. తన చెల్లి కవిత ఈ రాఖీ పండుగ రోజు కూడా జైలులో ఉండడం తనకు బాధగా ఉందంటూ.. ఖచ్చితంగా కవితకు త్వరలో బెయిల్ దొరుకుతుందంటూ అందులో ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పలు వార్తా కథనాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో కూడా ఆమె బెయిల్ కు సంబంధించి ప్రజలు భారీగా చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో నిజంగానే విలీనం కాబోతున్నదా?.. అందుకే కవితకు త్వరలోనే బెయిల్ లభిస్తదని కేటీఆర్ అంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నారా.. ? అంటూ ప్రజలు చెవులు కొరుక్కున్నారు.

Advertisement

Also Read: ఇక పాఠశాలల్లో ఆ పీరియడ్ తప్పనిసరి: భట్టి విక్రమార్క

అయితే, తాజాగా ఆమెకు కోర్టు బెయిల్ ను మంజూరు చేసింది. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై బయటకు రావడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. కవిత బెయిల్ పై బయటకు రావటం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల విజయం అంటూ ఆయన కామెంట్ చేశారు. అలుపెరుగని ప్రయత్నాలు చివరికి ఫలించాయంటూ ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ లో బండి సంజయ్ పేర్కొన్నారు.

Advertisement

అదేవిధంగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు బెయిల్ రావడంపై కాంగ్రెస్ పార్టీకి ఆయన అభినందనలు చెప్పారు. బీఆర్ఎస్ నాయకురాలు బెయిల్ పై బయటకు వచ్చారు.. కాంగ్రెస్ వ్యక్తి రాజ్యసభకు వెళ్లారంటూ బండి సంజయ్ కామెంట్ చేశారు.

Also Read: బిగ్ బ్రేకింగ్.. కవితకు బెయిల్ మంజూరు

‘వైన్ అండ్ డైన్ క్రైంలో భాగస్వాములు అయిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అభినందనలు’ అంటూ ఎక్స్ లో ఆయన పోస్ట్ పెట్టారు.

చూడాలి మరి.. కేంద్రమంత్రి బండి సంజయ్ కామెంట్స్ పై ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తాయో అనేది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×