E-Paper
Advertisement

ఇంటర్ బోర్డు బిగ్ అనౌన్స్ మెంట్.. ఈ తేదీలోగా అడ్మిషన్ తీసుకోకపోతే సీటు కష్టమే..?

ఇంటర్ బోర్డు బిగ్ అనౌన్స్ మెంట్.. ఈ తేదీలోగా అడ్మిషన్ తీసుకోకపోతే సీటు కష్టమే..?
Advertisement

Inter Admissions: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అభిలాషా అభినవ్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్-ఎయిడెడ్ మరియు ఇతర రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో మొదటి విడత అడ్మిషన్ల ప్రక్రియ మే 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మొదటి విడుత దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 8 నుంచి ప్రారంభంకానుంది. కాగా దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ ఈనెల 31గా పేర్కొన్నారు.

బోర్డు స్పష్టం..?

జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ జూన్ 30 నాటికి ముగియనుందని పేర్కొన్నారు. పదో తరగతిలో సాధించిన గ్రేడ్ పాయింట్ యావరేజ్ ఆధారంగా మాత్రమే అడ్మిషన్లు అందించనున్నట్లు తెలిపారు. కళాశాలలు ఎటువంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించకూడదని బోర్డు స్పష్టం చేసింది. టెన్త్ విద్యార్థులు ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న మార్కుల మెమోల ఆధారంగా తాత్కాలిక అడ్మిషన్లు పొందవచ్చని పేర్కొన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించిన తర్వాతే ఇవి ఫైనల్ అవ్వనున్నాయి. అడ్మిషన్ సమయంలో విద్యార్థి ఆధార్ నంబర్ సమర్పించడం తప్పనిసరి అని సూచించారు.

Advertisement

Also Read; బెంగాల్‌లో బీజేపీ విజయఢంకా.. పేర్ల మార్పుతో మొదలైన సరికొత్త రాజకీయం

బోర్డు అధికారిక వెబ్‌సైట్..

అలాగే ఈ ఏడాది నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పనిసరిగా ‘యాంటీ డ్రగ్ అఫిడవిట్’ సమర్పించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా ప్రైవేట్ కళాశాలలు తమ వద్ద అందుబాటులో ఉన్న సీట్లు, నిండిన సీట్లు, ఖాళీల వివరాలను ప్రతిరోజూ నోటీసు బోర్డులో ప్రదర్శించాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ స్పష్టంచేశాఉ. ఒక సెక్షన్‌కు గరిష్టంగా 88 మంది విద్యార్థులను మాత్రమే చేర్చుకోవాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కేవలం ఇంటర్ బోర్డు గుర్తింపు పొందిన కళాశాలల్లోనే చేర్పించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం బోర్డు అధికారిక వెబ్‌సైట్ www.tgbie.cgg.gov.in ను సందర్శించాలని తెలిపారు.

Advertisement

Also Read: రూ.100 లోపే అదిరిపోయే డేటా ప్లాన్స్.. Jio, Airtel, Vi, BSNL ఏదైనా సరే.. యూజర్లకు పండగే!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×