E-Paper
Advertisement

Chris Gayle: వెస్టిండీస్ ఛీ కొట్టింది, కానీ..క్రిస్ గేల్ ప్రాణాలు కాపాడిన బీసీసీఐ, లండ‌న్ కు తీసుకెళ్లి మ‌రీ

Chris Gayle:  వెస్టిండీస్ ఛీ కొట్టింది, కానీ..క్రిస్ గేల్ ప్రాణాలు కాపాడిన బీసీసీఐ, లండ‌న్ కు తీసుకెళ్లి మ‌రీ
Advertisement

Chris Gayle:  వెస్టిండీస్ మాజీ ఆటగాడు క్రిస్ గేల్ ( Chris Gayle) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు సిక్సర్లు, బౌండరీ లతో రెచ్చిపోయిన క్రిస్ గేల్.. ప్రస్తుతం రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే అలాంటి క్రిస్ గేల్ ఒకానొక సమయంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఆపరేషన్ కోసం డబ్బులు కూడా లేని పరిస్థితిలను ఎదుర్కొన్న క్రిస్ గేల్ కు, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారీ సహాయం చేసినట్లు తెలుస్తోంది. సర్జరీ కోసం అతన్ని లండన్ కు ( LONDON ) తీసుకువెళ్లిన బీసీసీఐ.. అతని కోసం కోట్లల్లో డబ్బులు ఖర్చు చేసిందని ఓ న్యూస్ న్యూస్ బయటకు వచ్చింది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సాయం చేసేందుకు ముందుకు రాక‌పోవ‌డంతో, క్రిస్ గేల్ నిరాశ చెందాడు. ఈ క్ర‌మంలో బీసీసీఐ ( BCCI) రంగంలోకి దిగి, క్రిస్ గేల్ కు సాయం చేసింది. ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Also Read: Tanveer Ahmed: బాబ‌ర్ ఒక్క‌ టైటిల్ గెలిస్తే, కోహ్లీ మాత్రం కెప్టెన్సీ కోసం బిచ్చగాడిలా మారాడు Tanveer Ahmed

క్రిస్ గేల్ ప్రాణాలు కాపాడిన బీసీసీఐ, లండ‌న్ కు తీసుకెళ్లి మ‌రీ

Advertisement

ఆపదలో ఉన్న క్రిస్ గేల్ ను భారత క్రికెట్ నియంత్రణ మండలి కాపాడింది. ఈ విషయాన్ని తాజాగా క్రిస్ గేల్ రివీల్ చేశారు. ఈ సంఘటన 2010లో జరగగా, ఓ ఇంటర్వ్యూలో క్రిస్ గేల్ బయట పెట్టారు. అప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. అప్పుడు క్రిస్ గేల్ కూడా ఐపీఎల్ ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే 2010 సంవత్సరంలో క్రిస్ గేల్ కు లిగమెంట్ గాయం సంభవించింది. దీని వల్ల సర్జరీ చేసుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొన్నారు క్రిస్ గేల్. అయితే ఈ సర్జరీ కోసం డబ్బులు లేకపోవడంతో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ను కోరాడు క్రిస్ గేల్.

ఆప‌ద‌లో ఆదుకున్న బీసీసీఐకి స్పెష‌ల్ థ్యాంక్స్ – క్రిస్ గేల్

కానీ ఆ సమయంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు నిరాకరణ తెలిపినట్లు తెలుస్తోంది. నీ డబ్బులతోనే సర్జరీ చేయించుకో… మేము ఒక్క రూపాయి కూడా ఇవ్వబోమని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కుండ బద్దలు కొట్టి చెప్పిందట. దీంతో చేసేదేమీ లేక నిరాశపడ్డ క్రిస్ గేల్.. ఐపీఎల్ ఆడుతున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలిని సంప్రదించాలని చెబుతున్నారు. అయితే సహాయం కావాలని కోరిన వెంటనే బీసీసీఐ పెద్దలు రంగంలోకి దిగారట. అతని సర్జరీ కోసం ఏర్పాట్లు చేసి.. లండన్ కూడా పంపించినట్లు తెలుస్తోంది. అక్కడ కోట్లల్లో డబ్బులు ఖర్చయినా కూడా మొత్తం బీసీసీఐ భరించింది. ఈ విషయాన్ని తాజాగా బయటపెట్టారు క్రిస్ గేల్. ఈ సహాయం చేసినందుకు జీవితాంతం బీసీసీఐ పెద్దలకు రుణపడి ఉంటానని క్రిస్ గేల్ స్పష్టం చేశారు. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.

Advertisement

 

Also Read: Raghu Sharma Letter: 33 ఏళ్ల వ‌య‌స్సులో ఐపీఎల్ లోకి ఎంట్రీ, జై శ్రీ రామ్ అంటూ లెట‌ర్‌…ఇంత‌కు ఎవ‌రీ రఘు శర్మ ?

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×