E-Paper
Advertisement

కరీనంగర్ చోరీ.. పక్కా ప్లానింగ్‌తో దోపిడీ, పోలీసులకు చిక్కిన ఆధారాలు.. మొదలైన వేట!

కరీనంగర్ చోరీ.. పక్కా ప్లానింగ్‌తో దోపిడీ, పోలీసులకు చిక్కిన ఆధారాలు.. మొదలైన వేట!
Advertisement

Karimnagar Robbery: కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించిన జ్యువెలరీ షాప్ చోరీ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ నేరానికి పాల్పడింది బీహార్‌కు చెందిన అంతర్రాష్ట్ర ముఠా అని ప్రాథమికంగా నిర్ధారించారు. సిసిటీవీ దృశ్యాలు, ఘటనా స్థలంలో లభించిన ఆధారాల ప్రాతిపదికన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు పకడ్బందీ వ్యూహాలను అమలు చేస్తున్నారు.

నిందితుల గుర్తింపు.. పాత నేరస్థుల హస్తం

Advertisement

చోరీకి పాల్పడిన ఐదుగురు సభ్యుల ముఠాలో ఇద్దరిని పోలీసులు పాత నేరస్థులుగా గుర్తించారు. గతంలో పలు నేరాల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించిన ఆనంద్, ఇంతియాజ్ ఈ గ్యాంగ్‌లో ఉన్నట్లు బలమైన ఆధారాలు లభించాయి. గతంలో చందానగర్ జ్యువెలరీ షాప్‌లో జరిగిన చోరీలో పాల్గొన్న వారే ఈ ఘటనలోనూ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మిగిలిన ముగ్గురు ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నారు.

Also Read: నిజమైన పాపాల భైరవులు మీరే.. కేటీఆర్, హరీష్ రావులకు మంత్రి స్ట్రాంగ్ కౌంటర్

Advertisement

బ్యాగుపై ఉన్న క్లూ.. దర్యాప్తులో మలుపు

దొంగలు షాపులో వదిలేసి వెళ్ళిన ఒక బ్యాగుపై ‘ఐ లవ్ నందూర్బార్’ అని రాసి ఉండటం పోలీసులకు కీలక ఆధారంగా మారింది. నందూర్బార్ అనేది మహారాష్ట్ర-గుజరాత్ సరిహద్దుల్లోని జిల్లా అని గుర్తించిన అధికారులు, ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. మే 3వ తేదీ ఉదయం 8:35 గంటలకు రుద్రారం నుంచి కరీంనగర్ వచ్చిన దొంగలు, ఉదయం 11 గంటలకు చోరీకి పాల్పడి కేవలం 12 నిమిషాల్లో పని పూర్తి చేసుకుని పారిపోయినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది.

తప్పించుకున్న మార్గం..గాలింపు చర్యలు

పోలీసుల కళ్ళు గప్పేందుకు ఈ ముఠా ప్రధాన రహదారులను కాకుండా దొడ్డిదారులు, కెనాల్ మార్గాలను ఎంచుకుంది. నిందితులు పరారైన పల్సర్ బైక్‌ను ధర్మపురి పట్టణంలోని గోదావరి తీరంలో పోలీసులు గుర్తించారు. బైక్‌తో పాటు సమీపంలోనే హెల్మెట్‌ను కూడా వదిలివెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం 16 ప్రత్యేక బృందాలుగా విడిపోయిన పోలీసులు గోదావరి తీర ప్రాంత గ్రామాలతో పాటు, అటవీ పరిసరాలు, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో నిఘా పెట్టారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×