E-Paper
Advertisement

‘సర్’ ప్రక్రియ వ్యవహారం.. టీఆర్ఎస్ ఛీప్ కవిత సంచలన కామెంట్స్, నా నియోజకవర్గంలో 7 వేల ఓట్లు తొలగింపు

‘సర్’ ప్రక్రియ వ్యవహారం.. టీఆర్ఎస్ ఛీప్ కవిత సంచలన కామెంట్స్,  నా నియోజకవర్గంలో 7 వేల ఓట్లు తొలగింపు
Advertisement

Hyderabad: తెలంగాణలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై రాజకీయ పార్టీల దుమారం మొదలైంది. ఈ విషయంలో తొలుత టీఆర్ఎస్ చీఫ్ కవిత రియాక్ట్ అయ్యారు. తన నియోజకవర్గంలో ఏడు వేల ఓట్లు తొలగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘సర్’ ప్రక్రియ వ్యవహారం.. కవిత సంచలన కామెంట్స్

Advertisement

తెలంగాణలో గడిచిన నాలుగు రోజులుగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ-సర్ మొదలైంది. కేవలం నాలుగు రోజుల్లో దాదాపు కోటి 43 లక్షల మందికి ఎన్యూమరేషన్ ఫారాలు అందించారు బీఆర్వోలు. ఈ ప్రక్రియ చేపట్టిన క్రమంలో రాజకీయ పార్టీల నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. తాజాగా టీఆర్ఎస్ ఛీప్ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

సోమవారం ఉదయం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆమె, పలు అంశాలు మీడియా దృష్టికి తెచ్చారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే విధంగా 33 వేల డూప్లికేట్ ఓట్లున్న కొడంగల్ నియోజకవర్గంలో ఏడాది కాలంలో కేవలం 808 మాత్రమే తొలగించారని ఆరోపించారు. అదే సమయంలో తన నియోజకవర్గం బోధన్ లో దాదాపు 7 వేల ఓట్లు ఎలా తొలగించారని విమర్శలు గుప్పించారు.

Advertisement

బోధన్ నియోజకవర్గంలో 7 వేల ఓట్లు తొలగింపు-కవిత ప్రశ్నలు

ఎలాంటి కారణాలు చెప్పకుండా తొలగించారన్నారు. ఈ వ్యత్యాసం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంలో ఎన్నికల సంఘం అధికారులను కలిసి అన్ని ఆధారాలు సమర్పిస్తామన్నారు. మాకొచ్చిన నివేదిక ఏంటంటే.. ముఖ్యమంత్రికి అనుకూలంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయని వెల్లడించారు.

కొండగల్‌ నియోజకవర్గంలో వేల సంఖ్యలో డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. దీనికి సంబంధించిన వివరాలు బయటపెట్టారు. ఎందుకంటే 2018-23 మధ్య కొండగల్‌ నియోజకవర్గంలో దాదాపు 30 వేల ఓట్లు పైగానే ఎలా పెరిగాయంటూ ప్రశ్నలు లేవనెత్తారు. కొండగల్ కు పక్కనేవున్న కర్ణాటక నియోజకవర్గానికి సంబంధించి ఓటర్లు 11 వేల ఓట్లు కొండగల్ లో ఉన్నారని విమర్శించారు.

ALSO READ: బీహార్ మైండ్‌సెట్‌తో మాట్లాడుతున్నారు.. బీజేపీ అధ్యక్షుడిపై చామల ఫైర్

మొన్నటి ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డికి వచ్చిన మెజార్టీ 32,532 ఓట్లు వచ్చాయని, అక్కడ 33433 వేల దొంగ ఓట్లు ఉన్నాయన్నారు. ఇదే సమయంలో కవిత తాను పోటీ చేయనున్న నియోజకవర్గంపై కొంత క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా చాలా నియోజకవర్గాలు ఉన్నా, ఆమె కేవలం బోధన్ గురించి ప్రస్తావించడంతో అక్కడ నుంచి ఆమె బరిలోకి దిగడం ఖాయమనే వాదన ఆ పార్టీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది.

 

 

Related News

మణుగూరు పట్టణం.. మంటల్లో వాహనాల షోరూం, తగలబడిన ఐదు కార్లు

దారుణం.. కారుకు అడ్డంగా నిలబడ్డాడని యూ టర్న్ తీసుకుని వ‌చ్చి మరీ కారుతో ఢీకొట్టి హత్య

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ బస్సు ఢీ, స్పాట్‌లో 10 మంది!

భాగ్యనగరంలో బోనాల సంబురం.. గోల్కొండ కోటలో తొలి బోనంతో షురూ అయిన జాతర

Kothagudem Hospital: కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. నిలబడి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి!

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. మరో కొత్త సేవలు!

Karimnagar: మరీ ఇంత దారుణమా.. నెంబర్ లేని జేసీబీతో పొలంలో ఉన్న రైతు పై దాడి!

Revanth Reddy: వనపర్తి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన!

Big Stories

Advertisement
×