E-Paper
Advertisement

బీహార్ మైండ్‌సెట్‌తో మాట్లాడుతున్నారు.. బీజేపీ అధ్యక్షుడిపై చామల ఫైర్

బీహార్ మైండ్‌సెట్‌తో మాట్లాడుతున్నారు.. బీజేపీ అధ్యక్షుడిపై చామల ఫైర్
Advertisement

MP Chamala:  తెలంగాణ రాజకీయాలు, ఇక్కడి పరిస్థితులపై బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ నితిన్‌ నబీన్‌‌కు కనీస అవగాహన లేదని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. నితిన్ నబీన్ తెలంగాణను తన సొంత రాష్ట్రమైన బీహార్ మైండ్‌సెట్‌తో చూస్తున్నారని, ఇక్కడి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇటీవల బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

బీహార్ మైండ్‌సెట్ ఇక్కడ సాగదు

Advertisement

తెలంగాణ ప్రత్యేక అస్తిత్వం, ఇక్కడి రాజకీయ చైతన్యం వేరని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నితిన్ నబీన్ బీహార్ రాజకీయాల తరహాలోనే తెలంగాణలోనూ మాట్లాడితే ప్రజలు నమ్మరన్నారు. స్థానిక పరిస్థితులపై అవగాహన పెంచుకోకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏటీఎం విమర్శలపై ప్రశ్నల వర్షం

Advertisement

గత బీఆర్ఎస్ పాలకులు తెలంగాణను ఏటీఎంలా వాడుకున్నారంటూ ఇప్పుడు బీజేపీ నేతలు మాట్లాడుతుండటాన్ని ఎంపీ తీవ్రంగా తప్పుపట్టారు. 2014 నుండి 2023 వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరుగుతుంటే అప్పుడు ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. కేంద్ర సంస్థల ద్వారా ఆ అవినీతిని ఎందుకు అడ్డుకోలేకపోయారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read: తెలంగాణలో బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ఆ సీట్లు కూడా రావు.. కాంగ్రెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

నాటకాలకు కాలం చెల్లింది

బీఆర్ఎస్, బీజేపీలు గతంలో లోపాయికారీ ఒప్పందాలతోనే నడిచాయని, కాళేశ్వరం అవినీతిపై కేంద్రం చర్యలు తీసుకోకపోవడమే అందుకు నిదర్శనమని చామల ఆరోపించారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రజాపాలన అందిస్తుంటే.. ఓర్వలేక బీజేపీ నేతలు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు చాలా తెలివైనవారని, బీజేపీ ఆడుతున్న రాజకీయ నాటకాలను గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. నితిన్ నబీన్ ఇప్పటికైనా తెలంగాణ చరిత్రను, ఇక్కడి వాస్తవాలను అధ్యయనం చేసి మాట్లాడితే మంచిదని హితవు పలికారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×