E-Paper
Advertisement

మణుగూరు పట్టణం.. మంటల్లో వాహనాల షోరూం, తగలబడిన ఐదు కార్లు

మణుగూరు పట్టణం.. మంటల్లో వాహనాల షోరూం, తగలబడిన ఐదు కార్లు
Advertisement

Manuguru town: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారీ అగ్నిప్రమాదం కలకలం రేపింది. మణుగూరు పట్టణంలోని గుట్ట మల్లారం ప్రాంతంలో సెకండ్ హ్యాండ్ కార్ల షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపు గంటల తర్వాత మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే మరింత నష్టం జరగకుండా కాపాడారు.

మణుగూరు పట్టణంలో ఘోర అగ్నిప్రమాదం-మణుగూరు మండలంలోని గుట్ట మల్లారం బైక్ షోరూం పక్కన కార్ మెకానిక్ షెడ్‌ ఉండి. ఏం జరిగిందో తెలీదుగానీ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షెడ్‌లో ఉన్న కారు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొన్ని కార్లు స్వల్పంగా డ్యామేజ్ అయ్యాయి. మంటల విషయం తెలియగానే స్థానికులు అలర్ట్ అయ్యారు. వెంటనే షోరూమ్ వ్యక్తికి సమాచారం ఇచ్చారు.

Advertisement

మంటల్లో కార్ల షోరూం-అటు ఫైర్ ఇంజన్లకు సమాచారం చేరవేశారు. అయితే  అక్కడికి చేరుకున్న ఫైర్ ఇంజన్ కాస్త మొరాయించినట్టు తెలిసింది. ఇంజిన్ పని చేయకపోవడంతో నీరు రావడం కష్టంగా మారింది. స్థానికులు నీటిని తీసుకొచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. దాదాపు గంట తర్వాత మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

కార్లతోపాటు షాపులోని స్పేర్ పార్టులు కాలిపోయినట్టు షాపు యజమాని తెలిపారు. కేవలం సామానుల విలువ 4 లక్షల వరకు ఉంటుందని షెడ్డు నిర్వాహకులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి వుంది.

Advertisement

ALSO READ: దారుణం.. కారుకు అడ్డంగా నిలబడ్డాడని యూ టర్న్ తీసుకుని వ‌చ్చి మరీ కారుతో ఢీకొట్టి హత్య

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×