E-Paper
Advertisement

డిస్నీల్యాండ్ కు పోటెత్తుతున్న టూరిస్టులు, మ్యాటర్ ఏంటో తెలుసా?

డిస్నీల్యాండ్ కు పోటెత్తుతున్న టూరిస్టులు, మ్యాటర్ ఏంటో తెలుసా?
Advertisement

Set Jetting Travel Trend: ప్రపంచ పర్యాటక రంగంలో కొత్త ట్రెండ్‌ మొదలయ్యింది. టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో కనిపించే ప్రదేశాలకు వెళ్లాలనే ఆసక్తి పర్యాటకులలో భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రసిద్ధ వినోద పార్క్ అయిన డిస్నీల్యాండ్ మరో అరుదైన మైలురాయిని అందుకుంది. ఇప్పటి వరకు బిలియన్ (100 కోట్ల) మంది సందర్శకులను ఆకర్షించి చరిత్ర సృష్టించింది. ప్రపంచ పర్యాటక రంగంలో అత్యంత అరుదైన గుర్తింపు తెచ్చుకుంది. ఫ్యామిలీస్, చిల్డ్రెన్, విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో డిస్నీల్యాండ్‌ను సందర్శిస్తుండటంతో ఈ ఘనతను సాధించింది.

‘సెట్ జెట్టింగ్’ ట్రెండ్ వైరల్

మరోవైపు,  సెట్ జెట్టింగ్ అనే కొత్త ట్రావెల్ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. సెట్ జెట్టింగ్ అంటే, టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో కనిపించే అందమైన ప్రాంతాలను ప్రత్యక్షంగా చూడాలనే ఉద్దేశంతో ప్రయాణాలను ప్లాన్ చేయడం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కొన్ని టీవీ షోలు, సిరీస్‌లు ప్రసారం కాకముందే వాటి చిత్రీకరణ జరిగిన ప్రదేశాలకు టూరిస్టులు ముందుగానే ట్రిప్‌ లను బుక్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ల ప్రభావంతో ఈ ట్రెండ్ మరింత వేగంగా పెరుగుతోంది. ఒక అందమైన ప్రదేశం సినిమాలో, సిరీస్‌లో కనిపించబోతోందని తెలిసిన వెంటనే, అక్కడికి వెళ్లేందుకు చాలామంది ముందుగానే హోటళ్లు, విమాన టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.

Advertisement

Read Also: ఎయిర్ ఇండియా సూపర్ న్యూస్.. ఢిల్లీ-టొరంటో మధ్య ఇక నాన్‌స్టాప్ ఫ్లైట్!

భవిష్యత్ లో మరింత డిమాండ్

టూరిజం నిపుణుల అభిప్రాయం ప్రకారం, భవిష్యత్తులో ఈ టైప్ ప్రయాణాలకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. వినోదంతో పాటు కొత్త ప్రదేశాలను అనుభవించాలనే ఆసక్తి యువతలో ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే పర్యాటక రంగంలో ఇలాంటి కొత్త ధోరణులు వేగంగా విస్తరిస్తున్నాయంటున్నారు. మొత్తానికి, డిస్నీల్యాండ్  బిలియన్ సందర్శకుల మైలురాయిని చేరుకోవడం, అలాగే  సెట్ జెట్టింగ్ వంటి కొత్త ట్రావెల్ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందడం పర్యాటక రంగంలో చోటుచేసుకుంటున్న కీలక మార్పులకు నిదర్శనంగా నిలుస్తోంది.

Advertisement

Read Also: ఆకుపచ్చ నగరంగా మారిన కాంక్రీట్ జంగిల్‌.. ఇది కదా నిజమైన గ్రీన్ రివల్యూషన్ అంటే!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×