E-Paper
Advertisement

Kharif 2026: యూరియా కోసం ఢిల్లీకి స్పెషల్ టీమ్: మంత్రి తుమ్మల!

Kharif 2026: యూరియా కోసం ఢిల్లీకి స్పెషల్ టీమ్: మంత్రి తుమ్మల!
Advertisement

Kharif 2026: స్వేచ్ఛ బ్యూరో: ఖరీఫ్ 2026లో రాష్ట్రంలో మొత్తం పంట విస్తీర్ణం సుమారు 60.60 లక్షల హెక్టార్లకు చేరుకునే అవకాశముందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సీజన్‌లో ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ వంటి పంటలు సాగు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముందస్తు యూరియా నిల్వల కోసం వ్యవసాయశాఖ అధికారులు న్యూఢిల్లీలోని కేంద్ర అధికారులతో సమన్వయం చేసుకోవాలని, యూరియా సరఫరాలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ సెక్రటరీని ఆదివారం అదేశించారు.

ఇబ్బందులు లేకుండా..

రాష్ట్రంలో సాధారణంగా జూన్, జులై నెలలలో యూరియాకు డిమాండ్ ఎక్కువగా ఉండి, అమ్మకాలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లోనే ముందస్తుగా యూరియాను కేంద్రం నుంచి తెప్పించి నిల్వలు ఉంచుకునట్లైతే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో పంపిణీ చేయడానికి వీలవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికే యూరియా పక్కదారి పట్టకుండా, యూరియా పంపిణీని పకడ్బందీగా నిర్వహించేందుకు యూరియా యాప్ ని అమలు చేస్తోందని తెలిపారు. ఈ విధానం ద్వారా ఎరువుల కోసం రైతులు లైన్లలో నిలబడి ఇబ్బంది పడకుండా వారికి అవసరమైన సమయానికి, వారి పంట విస్తీర్ణానికి అనుగుణంగా, సమీప యూరియా విక్రయకేంద్రాల ద్వారా ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Advertisement

Also read: కరీంనర్‌లో ఓ కవికి దక్కిన జాతీయ స్థాయి అరుదైన గౌరవం..?

ఏప్రిల్ , మే నెలల్లో..

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన యూరియా కోటాను సమర్థవంతంగా పొందేందుకు, అలాగే జూన్, జులై నెలల్లో ఏర్పడే అధిక డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ముందస్తు నిల్వలు ఏర్పరచేందుకు, కేటాయించిన యూరియాలో ఏప్రిల్ , మే నెలల్లో నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున సరఫరా జరిగేలా న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రిత్వ శాఖలు, ఎరువుల శాఖ, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి తగిన యూరియా కేటాయింపును సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనపు వ్యవసాయ సంచాలకులు డీల్లీకి వెళ్లాలని మంత్రి ఆదేశించారు.

Advertisement

Also read: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో మేనకా గాంధీ భేటీ!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×