E-Paper
Advertisement

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: రాంచందర్ రావు

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: రాంచందర్ రావు
Advertisement

Ramchander Rao: స్వేచ్ఛ బ్యూరో: నాయకులు, కార్యకర్తలంతా జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ రాష్​ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పిలుపునిచ్చారు. దిల్‌సుఖ్‌నగర్‌లో పలు బీఆర్ఎస్, కాంగ్రెస్ కు చెందిన పలువురు నాయకులు ఆదివారం బీజేపీలో చేరారు. కాగా వారికి రాంచందర్ రావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధి నిలిచిపోయిందని, కేంద్రం కృషితోనే మౌలిక సదుపాయాల అభివృద్ధి జరిగిందని ఆయన పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు.

ఏప్రిల్ 6న..

కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరితో ఉందని విమర్శించారు. మత రాజకీయాలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఫైరయ్యారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం విఫలమైందని, ప్రపంచంలో ఇంధన సంక్షోభం ఉన్నా.. భారత్‌లో కొరత లేదన్నారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఏప్రిల్ 6న బీజేపీ స్థాపన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

Advertisement

Also read: కరీంనర్‌లో ఓ కవికి దక్కిన జాతీయ స్థాయి అరుదైన గౌరవం..?

132వ మన్ కీ బాత్ కార్యక్రమం

అనంతరం గన్‌ఫౌండ్రీ డివిజన్‌లో నిర్వహించిన ప్రధాని మోడీ 132వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని రాంచందర్ రావు వీక్షించారు. అంనతరం ఆయన మాట్లాడుతూ.. మన్ కీ బాత్.. సామాజిక చైతన్యం, పర్యావరణ బాధ్యత, నీటి సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి వంటి అనేక ముఖ్యమైన అంశాలపై ప్రజలకు విలువైన మార్గదర్శకత్వాన్ని అందించిందన్నారు. ప్రధాని మోడీ తెలంగాణకు చెందిన రెండు ప్రేరణాత్మక ఉదాహరణలను ప్రత్యేకంగా ప్రస్తావించడం గర్వకారణంగా నిలిచిందన్నారు.

అదే స్ఫూర్తితో..

Advertisement

యువ భారత్ కార్యక్రమానికి సంబంధించి సూర్యాపేటకు చెందిన రఘువీర్ రెడ్డిని ప్రస్తావించడం యువతకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. అదేవిధంగా, మంచిర్యాల జిల్లాలో గ్రామీణ స్థాయిలో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు కోసం జరుగుతున్న కృషిని ఆయన అభినందించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని రాంచందర్ రావు తెలిపారు. అదే స్ఫూర్తితో.. బీజేపీ కార్పొరేటర్ ‘గో గ్రీన్’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, ప్రకృతికి మేలు చేసే సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించాలనే సందేశం ప్రజల్లో మంచి స్పందన పొందుతోందన్నారు.

Also read: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో మేనకా గాంధీ భేటీ!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×