E-Paper
Advertisement

బొండం కొట్టే ముందు ఈ ‘సీక్రెట్’ తెలియకపోతే.. మీరు నిలువునా మునిగినట్టే!

బొండం కొట్టే ముందు ఈ ‘సీక్రెట్’ తెలియకపోతే.. మీరు నిలువునా మునిగినట్టే!
Advertisement

coconut tips: ఎండకాలం వచ్చిందంటే చాలు.. గొంతు ఎండిపోతోంది.అదే సమయంలో రోడ్డు పక్కన కొబ్బరి బొండం కనిపిస్తే చాలు, ప్రాణం లేచొస్తుంది.మరి ఆశగా 50-60 రూపాయలు పెట్టి బొండం కొట్టాక అందులో నీళ్ళు ఉండపోతే వచ్చే కోపం మాములుగా ఉండదు. మరి నిండుగా నీళ్లున్న కొబ్బరి బొండాం ని ఎలా కనిపెట్టాలో ఇప్పుడు చూద్దాం.

చెవి దగ్గర పెట్టుకుంటే  నీళ్ళ సౌండ్ వస్తుందా?

 సాధారణంగా చాలా మంది చేసేదేమిటంటే బొండాన్ని చెవి దగ్గర పెట్టుకుని నీళ్ళ సౌండ్ వస్తుందా  లేదా అని చెక్ చేస్తుంటారు.ఏ మాత్రం కాస్త సౌండ్ వచ్చినా ఎంచక్కా నీళ్ళున్నాయని సెలెక్ట్ చేసుకుంటారు. కాని అది తప్పు. ఎందుకంటే గాలి ఎక్కువగా ఉంటేనే సౌండ్ వస్తుంది.బొండంలో నీళ్లు నిండా ఉంటే అసలు సౌండనేదే రాదు. కాబట్టి చప్పుడు రాని బొండాన్నే సెలెక్ట్ చేసుకుంటే మంచింది

Advertisement

also read:Palm Toddy vs Date Toddy: తాటికల్లు Vs ఈతకల్లు:ఏది తాగితే మీ బాడీ ఏసీలా మారుతుందో తెలుసా!

కాస్త డల్‌గా ఉన్నా, నీళ్లు మాత్రం ఫుల్

ఇక మరో ముఖ్యమైన విషయం ..పెద్దగా  పచ్చగా ఉండే బొండాలు చూసి అస్సలు మోసపోకండి. ఎందుకంటే ముదురు పచ్చగా ఉంటే అది చూడటానికి బాగుంటుందేమో కానీ లోపల కొబ్బరి ముదిరిపోయి, నీటి శాతం తగ్గే అవకాశం ఉంది.సో లేత పచ్చ లేదా కొంచెం పసుపు ఛాయ (Yellowish-green) ఉన్న బొండాలను ఎంచుకోవడం మేలు .ఇవి చూడటానికి కాస్త డల్‌గా ఉన్నా, నీళ్లు మాత్రం ఫుల్ గా ఉంటాయ్ ..ఈ నీళ్ళకి  తీపి కూడా ఎక్కువేనండోయ్.

‘సైజ్ కాదు, షేప్ ముఖ్యం’

Advertisement

ఇక చాలామంది ఏమనుకుంటారంటే  పెద్ద బొండాలు చూసి ఎక్కువ నీళ్లు ఉంటాయని బ్రమ పడిపోతారు.. కానీ, కొబ్బరి బొండాల విషయంలో ‘సైజ్ కాదు, షేప్ ముఖ్యం’.యస్ ..పొడవుగా ఉండే బొండాల కంటే.. మీడియం రేంజ్ లో (Medium size) ఉండే. గుండ్రని బొండాలే బెస్ట్!

ఏ బొండం అయితే ఎక్కువ బరువుగా అనిపిస్తుందో

 ఇక రెండు ఒకే సైజులో ఉన్న బొండాలను రెండు చేతుల్లో పట్టుకొని ఒక సారి చెక్ చేయండి .వాటిల్లో ఏ బొండం అయితే ఎక్కువ బరువుగా అనిపిస్తుందో అందులో నీళ్లు నిండుగా ఉన్నాయని గుర్తుంచుకోండి.ఎందుకంటే  గాలి కంటే నీరు బరువు కాబట్టి,  సో ..బరువు ఎక్కువగా ఉన్నదే మన టార్గెట్!

గోధుమ రంగులోకి మారి ఎండిపోయినట్టు ఉంటే

 ఇక బొండం పైన భాగం (కాడ ఉండే చోటు) పచ్చగా ఉందా ..  అది తాజాదని  అర్థం.అదే గోధుమ రంగులోకి మారి ఎండిపోయినట్టు ఉంటే అది ఎప్పుడో కోసిన పాత స్టాక్ అని అర్థం.కొబ్బరి నీళ్లు కేవలం దాహం తీర్చడమే కాదు, బాడీకి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ ఇచ్చే సూపర్ డ్రింక్. సో …ఇకనైనా  కొబ్బరి నీళ్ల బండి దగ్గరికి వెళ్లినప్పుడు, ట్రిక్స్ వాడండి. మీరు పెట్టిన ప్రతి పైసాకు తృప్తిని పొందండి !

also read:Dhurandhar Controversy: 1100 కోట్లు కొట్టారు సరే.. మా వాటా ఎక్కడ? అంటుంది ఎవరో తెలుసా ?వీడియో వైరల్

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×