E-Paper
Advertisement

విద్యార్థులకు గుడ్ న్యూస్.. వేసవి సెలవులు పొడగింపు.. ఎప్పటివరకు అంటే?

విద్యార్థులకు గుడ్ న్యూస్.. వేసవి సెలవులు పొడగింపు.. ఎప్పటివరకు అంటే?
Advertisement

School Holidays: తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఎండల తీవ్రత, మారుతున్న వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వేసవి సెలవులను మరికొన్ని రోజుల పాటు పొడిగిస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. షెడ్యూల్ ప్రకారం జూన్ 12వ తేదీన ప్రారంభం కావాల్సిన పాఠశాలలు.. జూన్ 15వ తేదీ నుంచి తిరిగి తెరుచుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఎండల తీవ్రత వల్లే..!

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జూన్ మొదటి వారం వచ్చినప్పటికీ ఎండల వేడి, వడగాల్పుల ప్రభావం పలుచోట్ల కనిపిస్తూనే ఉంది. ఈ తరుణంలో చిన్న పిల్లలను పాఠశాలలకు పంపించడం వల్ల వారి ఆరోగ్యంపై ప్రభావం పడొచ్చని తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని.. ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు సెలవులను పొడగించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం.

జూన్ 15 నుండి స్కూల్స్ ఓపెన్!

Advertisement

విద్యాశాఖ సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థలకు ఈ సెలవుల పొడిగింపు వర్తించనుంది. జూన్ 14 వరకు సెలవులు కొనసాగనున్నాయి. తిరిగి జూన్ 15 (సోమవారం) నుండి పాఠశాలలు యధావిధిగా ప్రారంభమై 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన బోధనా తరగతులు అధికారికంగా మొదలవుతాయని అధికారులు సూచిస్తున్నారు. దీనిపై రెండ్రోజుల్లో అధికారిక ప్రకటన సైతం రావొచ్చని తెలుస్తోంది. ఈ ఆదేశాలను అన్ని పాఠశాలలు తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించి ముందే స్కూళ్లు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించనున్నట్లు తెలుస్తోంది.

Also Read: కేటీఆర్, కవితలపై రఘునందన్ రావు ఫైర్.. 2007లో ఎక్కడున్నారు? అంటూ ప్రశ్నల వర్షం!

విద్యార్థులు, తల్లిదండ్రులకు ఊరట!

Advertisement

వేసవి సెలవులను రాష్ట్ర ప్రభుత్వం పొడగిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జూన్ మొదటి వారంలో కూడా ఎండలు మండిపోతుండటంతో స్కూళ్లకు ఎలా వెళ్లాలా? అని తెగ టెన్షన్ పడిపోయినట్లు పలువురు విద్యార్థులు చెబుతున్నారు. సెలవులు పొడగింపు ప్రచారంతో తమకు ఊరట లభించినట్లైందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు పాఠశాలలు తెరిచే నాటికి పుస్తకాల పంపిణీ, యూనిఫామ్స్ సిద్ధం చేసేలా విద్యాశాఖ ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది.

Also Read: రామ్‌చరణ్ ఊచకోత.. 48 గంటల్లోనే రూ. 181 కోట్లు. కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×