E-Paper
Advertisement

Ward Meetings: అలియాబాద్‌లో ప్రజా పాలన సభలు.. మున్సిపల్ చైర్మన్ హడావుడి!

Ward Meetings: అలియాబాద్‌లో ప్రజా పాలన సభలు.. మున్సిపల్ చైర్మన్ హడావుడి!
Advertisement

Ward Meetings: స్వేచ్చ బ్యూరో: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా అలియాబాద్ పురపాలక సంఘం పరిధిలోని 12వ వార్డు యాడారం, 13వ వార్డు మురహరిపల్లి గ్రామాల్లో శుక్రవారం వార్డు సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల నుంచి సమస్యలు, అభివృద్ధి పనులకు సంబంధించిన వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు.

అభివృద్ధి పనులు..

ఈ సందర్భంగా అలియాబాద్ మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. వార్డు సభల ద్వారా ప్రజల అవసరాలను నేరుగా తెలుసుకుని ప్రాధాన్యత ఆధారంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. పట్టణ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, ప్రతి పౌరుడు పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని కోరారు.

Advertisement

Also read: రేవంత్‌కు క్లోజ్‌గా ఉండటంతో.. నా ఫోనూ ట్యాప్ చేశారు.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

శిరీష కృష్ణారెడ్డి మాట్లాడుతూ..

సభల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించడం, వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దోమల నివారణ చర్యలు, మురుగు కాలువల నిర్వహణ, తాగునీటి సంరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం మురహరిపల్లి గ్రామ సమీపంలోని రాజీవ్ రహదారిపై నిర్మించనున్న బస్‌షెల్టర్‌కు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా శిరీష కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. బస్‌షెల్టర్ నిర్మాణంతో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, ఇతర ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు పురపాలక సంఘం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటరెడ్డి, కౌన్సిలర్లు యూసుఫ్ బాబా, హనుమాన్ దాస్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

Advertisement

Also read: భారీ శబ్దంతో చీలిపోయిన రైలు బోగి.. భయంతో ప్రయాణికుల పరుగులు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×