E-Paper
Advertisement

Telangana Elections : బీజేపీకి తలనొప్పిగా జనసేన సీట్ల కేటాయింపు

Telangana Elections : ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ(Telangana)లోనూ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పాపులారిటీని ఉపయోగించుకోవాలని చూస్తున్న బీజేపీకి(BJP) సీట్ల కేటాయింపు వ్యవహారం తలనొప్పిగా మారింది.

Telangana Elections : బీజేపీకి తలనొప్పిగా జనసేన సీట్ల కేటాయింపు
Advertisement

Telangana Elections : ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ(Telangana)లోనూ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పాపులారిటీని ఉపయోగించుకోవాలని చూస్తున్న బీజేపీకి(BJP) సీట్ల కేటాయింపు వ్యవహారం తలనొప్పిగా మారింది.

బీజేపీ నాయకులే స్వయంగా వెళ్లి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను తెలంగాణ ఎన్నికలలో మద్దతు కోరిన విషయం తెలిసిందే. అయితే జనసేన కూడా తెలంగాణ ఎన్నికలలో పోటీ చేస్తోంది. దీంతో ఇద్దరి మధ్య పొత్తు కుదిరినా.. సీట్ల కేటాయింపులలో మాత్రం ఇరు పక్షాలు నాయకులు ఒక అంగీకారానికి రావడం లేదు.

Advertisement

ముఖ్యంగా ఆంధ్రా సెటిలర్ల ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉన్న కూకట్ పల్లి లాంటి ప్రాంతాలపైనే ఇరు పార్టీల కన్ను. జనసేన దాదాపు స్వయంగా పోటీ చయాలనుకుని సీట్లు కూడా ఖరారు చేసుకున్న తరుణంలో బీజేపీ పొత్తు పిలుపు వచ్చింది. ఇప్పుడు పొత్తు ఉంది కాబట్టి బీజేపీ అభ్యర్థులు జనసేనకు సీట్లు కేటాయించే అవకాశం ఉండటంతో బీజేపీ ఆశావాహులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కూకట్‌పల్లి సీటును జనసేనకు ఇవ్వొద్దని స్థానిక బీజేపీ నేతలు పార్టీ ఆఫీసు ముందు ఇటీవలే నిరసన కూడా చేశారు. ఈ క్రమంలో జనసేనకు టికెట్ల కేటాయింపు వ్యవహారం బీజేపీ అధిష్టానం వరకు వెళ్లింది. ఇప్పుడు బీజేపీ పెద్దలు ఢిల్లీలో దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారు వేచిచూడాలి.

Advertisement

మరోవైపు మొదటి జాబితాలో కొందరు అభ్యర్థులను మార్చాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ వెస్ట్ సీటు రాకపోవడంతో రాకేష్ రెడ్డి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలో దిగాలని భావిస్తున్నట్లు సమాచారం.

యాకుత్‌పుర అభ్యర్థిని వీరేందర్ యాదవ్‌ను మార్చాలని స్థానిక బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. అలాగే నర్సాపూర్ టికెట్‌ను మురళీయాదవ్‌కు కేటాయించటాన్ని మరో బీజేపీ నాయకుడు సింగాయపల్లి గోపి అనుచరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గోపి వర్గం సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ధర్నా కూడా చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×