E-Paper
Advertisement

నా సీటు చోరీ జరిగింది.. ఎలాంటి లీగల్ కేసుల్లేవ్, అందుకే మీడియా ముందుకు మీనాక్షి నటరాజన్

నా సీటు చోరీ జరిగింది.. ఎలాంటి లీగల్ కేసుల్లేవ్, అందుకే మీడియా ముందుకు మీనాక్షి నటరాజన్
Advertisement

Hyderabad: తనపై ఎలాంటి లీగల్ కేసులు లేవన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఎలక్షన్ కాలమ్స్ లో లీగల్ నోటీసు కాలమ్ ప్రస్తావన లేదన్నారు. నా సీటు చోరీ జరిగిందని ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేశారన్నారు. నామినేషన్ తిరస్కరణకు గురైనందున తనకు ఎలాంటి నిరాశ లేదన్నారు. బీజేపీ చేస్తున్న కుట్రలను సమాజానికి తెలియజేయాలన్నది మా పోరాటమన్నారు.

రాజ్యసభ సీటు వ్యవహారం.. మీడియా ముందుకు మీనాక్షి నటరాజన్

Advertisement

ఎట్టకేలకు రాజ్యసభ సీటు విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఆదివారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో ఆమె తొలిసారి నోరు విప్పారు. ముమ్మాటికీ నా సీటు చోరీ జరిగిందన్నారు. ఫామ్-26లో పెండింగ్ కేసుల కాలమ్ లేదన్నారు.

ఆ కాలం ఉండి ఉంటే తనకు సంబంధించిన వివరాలను తప్పకుండా అందులో నింపి ఉండేదానినని తెలిపారు. రిటర్నింగ్ అధికారికి రాజ్యసభ నామినేషన్ సమర్పించే ముందు న్యాయ నిపుణులు తన నామినేషన్ క్షుణ్నంగా పరిశీలించారని వివరించారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం కాంప్రమైజ్ అయ్యిందన్నారు.

Advertisement

నా సీటు చోరీ అయ్యింది.. ఇది బీజేపీ కుట్ర

తాను మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తినని, తెలంగాణ నుంచి రాజీనామా చేయించినా ఆ స్థానాన్ని తాను తీసుకోనన్నారు. పార్టీ నేతలు వేరే రాష్ట్రాల నుంచి ఎంపిక అయ్యారని అన్నారు. తన కోసం తెలంగాణ రాజ్యసభ స్థానాన్ని ఇస్తే ఏమాత్రం ఒప్పుకోనన్నారు. కేసులపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేతలు సమాచారం ఇచ్చారనేది పచ్చి అబద్ధమని కుండబద్దలు కొట్టేశారు మీనాక్షి నటరాజన్.

ఈ విషయంలో కావాలని బీజేపీ అబద్ధాలు సృష్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎప్పుడూ బాధితుల పక్షమేనని, శ్రీలతకు తాను అండగా ఉన్నానని మనసులోని మాట బయట పెట్టారు. మహిళగా ఆమె వెర్షన్ విన్నామని, ఆమె బాధను అర్థం చేసుకొని డీసీసీ అధ్యక్షుడిని తొలగించామన్నారు.

ALSO READ: చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు.. తెలంగాణలో భారీ వర్షాలు, ఇక హైదరాబాద్‌లో

కేసు ఉన్నంత మాత్రాన తన నామినేషన్ తిరస్కరణ కాలేదన్నారు. ఈ విషయంలో బీజేపీ-ఎన్నికల సంఘం కాంప్రమైజ్ అయ్యాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అందువల్లే తన నామినేషన్ తిరస్కరించారని గుర్తు చేశారు. ఇది ఒక్క సీటుకు సంబంధించిన విషయం కాదని, ఒకే దేశం-ఒకే ఎన్నికకు బీజేపీ తెరలేపిందన్నారు.

సోషల్ మీడియా యుగం నడుస్తోందని, అన్ని విషయాలు త్వరలో బయటకు వస్తాయన్నారు. తన రాజ్యసభ నామినేషన్ రిజక్ట్ చేసినందుకు బాధ లేదని, దీనిద్వారా బీజేపీ కుట్ర బయట పడిందన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, బీజేపీ నేతలను నామినేషన్ రూమ్‌లోని ఎలా అనుమతించారంటూ పలు ప్రశ్నలు రైజ్ చేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×