E-Paper
Advertisement

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..
Advertisement

Kissik Talks Show : ప్రేక్షకులను నిత్యం వార్తలతో ఆకట్టుకుంటూ వస్తున్న టాప్ న్యూస్ చానల్స్ లలో బిగ్ టివి ఒకటి.. ఈ ఛానల్ అందించడంతోపాటుగా.. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్లను కూడా ప్రసారం చేస్తుంది. ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న టాప్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం అంటే తక్కును గుర్తొచ్చేది కిస్సిక్ టాక్స్.. ఈ షో కి హోస్టుగా జబర్దస్త్ కమెడియన్ వర్ష వ్యవహరిస్తుంది.. ఇప్పటివరకు ఈ షో కి ఎంతోమంది టీవీ స్టార్స్ అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ కూడా వచ్చారు.. తాజాగా ఈ షోకు ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లుయన్సర్స్ స్నో అక్క అలియాస్ మౌనీష గెస్టుగా వచ్చింది.. ఆమె తన జీవితంలో జరిగిన ఎమోషనల్ సంఘటనల గురించి పంచుకుంది.. ప్రస్తుతం ఈ షో ఎపిసోడ్ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఆమె ఏం చెప్పిందో ఒకసారి తెలుసుకుందాం..

మౌనీష జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన…

స్నో అక్క అలియాస్ మౌనిష తన గురించి తన ఫ్యామిలీ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ షోలో బయటపెట్టింది.. ఈ క్రమంలో ఆమె జీవితంలో ఎదుర్కొన్న అత్యంత బాధాకరమైన ఘటన గురించి చెప్పమని వర్ష అడుగుతుంది.. అయితే నేను నా జీవితంలో అనేక సంఘటనలను ఎదుర్కొన్నాను.. కానీ అందులో అత్యంత బాధాకరమైన సంఘటన అంటే నా బేబీని నేను కోల్పోవడమే.. నాకు ఏడవ నెల ఉన్నప్పుడు సడన్గా బేబీకి హార్ట్ బీట్ ఆగిపోయింది.. ఇక ఎమర్జెన్సీ తో బయటికి తీసేసారు.. ఆ బిడ్డ మీద నేను మా ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నాము.. కానీ అలా జరగడంతో మేము కోలుకోవడానికి చాలా కాలం పట్టింది.. నా జీవితంలో మర్చిపోలేని ఘటన అంటే అదే అని మౌనిష కన్నీళ్లు పెట్టుకుంది..

దేవుడు మీద నమ్మకం వచ్చింది..

Advertisement

మా బిడ్డ భూమ్మీదకి రాబోతుంది అని చాలా సంతోషంగా ఉన్నాము. కానీ ఆ బిడ్డని ఏడో నెలలోనే కోల్పోవడం మాకు తీరని లోటు. అప్పుడు దేవుడు లేడు అని అనుకున్నాను.. అప్పటినుంచి దేవుడి మీద నమ్మకం కూడా పోయింది.. ఆ తర్వాత వెంటనే రెండవ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది.. ఆ బిడ్డ కడుపులో పడిందన్న సంతోషం కూడా మాకు లేదు.. ఎప్పుడూ ఏదో ఒక కాంప్లికేషన్స్ రావడంతో దేవుడిని నమ్మాలా లేదా అని అనుకున్నాము.. కడుపుతో ఉన్నాను అన్న ఆనందం కూడా నాకు లేకుండా ఉండిపోయింది.. చివరికి డెలివరీ టైమ్ లో కూడా పాప హార్ట్ బీట్ తగ్గిపోతుంది అని టెన్షన్ పెట్టారు.. ఎమర్జెన్సీ తో ఆపరేషన్ చేసి పాపను బయటకు తీశారు.. అప్పుడు నాకు దేవుడి మీద నమ్మకం వచ్చింది అని మౌనిష చెప్పుకొచ్చారు.. ఈమె అమెరికాలో పిల్లలకు ఎలాంటి జీవితం ఉంటుంది అన్న విషయాల గురించి కూడా పంచుకున్నారు.. ఎపిసోడ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.. ఇక ఆ ఎపిసోడ్లో ఆమె ఎలాంటి విషయాల గురించి బయట పెట్టారో ఒకసారి తెలుసుకుందాం ..

Also Read :Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×