E-Paper
Advertisement

రూ.15 వేల బడ్జెట్లో బెస్ట్ స్మార్ట్ ప్రొజెక్టర్లు ఇవే.. ఇంట్లోనే సినిమా హాల్!

రూ.15 వేల బడ్జెట్లో బెస్ట్ స్మార్ట్ ప్రొజెక్టర్లు ఇవే.. ఇంట్లోనే సినిమా హాల్!
Advertisement

Best projector under 15000: ఇంట్లోనే థియేటర్ లాంటి ఫీలింగ్ రావాలంటే.. ఒకప్పుడు వేలల్లో, లక్షల్లో ఖర్చు పెట్టి పెద్ద సైజ్ స్మార్ట్ టీవీలు కొనాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. కేవలం రూ. 15,000 లోపు బడ్జెట్లోనే మీ బెడ్‌రూమ్ లేదా లివింగ్ రూమ్‌ను పర్ఫెక్ట్ హోమ్ థియేటర్‌గా మార్చేసే స్మార్ట్ ప్రొజెక్టర్లు మార్కెట్లోకి వచ్చేశాయి. ఫుల్ హెచ్‌డీ క్లారిటీ, ఇన్‌బిల్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో సపోర్ట్‌తో విపరీతంగా ట్రెండ్ అవుతున్న టాప్ 5 బడ్జెట్ ప్రొజెక్టర్ల లిస్ట్ మీకోసం.

సినిమాలు, వెబ్ సిరీస్‌లను వంద ఇంచుల కంటే పెద్ద స్క్రీన్‌పై చూస్తే వచ్చే మజాయే వేరు. ప్రస్తుతం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న టాప్ 5 ప్రొజెక్టర్లు ఇవే..

బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రొజెక్టర్ల లిస్ట్: 

1. WZATCO Yuva Go Pro (వ్‌జాట్కో యువ గో ప్రో):

Advertisement

బడ్జెట్ ప్రొజెక్టర్ల సెగ్మెంట్లో ‘వ్‌జాట్కో’ బ్రాండ్‌కు మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఇందులో ఉండే ఆటోమేటిక్ ఫీచర్లు యూత్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇది నేటివ్ 1080p రెజల్యూషన్‌తో వస్తుంది.అంతే కాకుండా 4K HDR కంటెంట్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌తో రన్ అవుతుంది. ఇందులో ‘ఆటో ఫోకస్’ ఫీచర్ ఉంది. అంటే ప్రొజెక్టర్‌ను ఎక్కడ పెట్టినా స్క్రీన్ ఆటోమేటిక్‌గా క్లియర్ అయిపోతుంది. వైఫై 6 ఉండటం వల్ల బఫరింగ్ లేకుండా స్ట్రీమింగ్ అవుతుంది.

2. E GATE Atom 4X+:

ఇండియన్ బ్రాండ్ అయిన ‘ఈ-గేట్’ తక్కువ ధరలో ఎక్కువ బ్రైట్‌నెస్ ఇచ్చే ప్రొజెక్టర్లను తయారు చేయడంలో ఫేమస్. ఇది 400 ISO ల్యూమెన్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీనివల్ల గదిలో కొద్దిగా వెలుతురు ఉన్నా కూడా పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది. ఇందులో ఇన్‌బిల్ట్ లైవ్ టీవీ యాప్స్ వస్తాయి. దీనికి ‘Auto Keystone Correction’ ఉండటం వల్ల వంకరగా ఉన్న స్క్రీన్‌ను కూడా సెకన్లలో స్ట్రెయిట్‌గా అడ్జస్ట్ చేస్తుంది.

3. Pixpaq Japan Power Projector:

Advertisement

ఈ మధ్య కాలంలో సినిమా లవర్స్ నోట ఎక్కువగా వినిపిస్తున్న పేరు పిక్స్‌పాక్. కలర్ అక్యూరసీ విషయంలో దీనికి మంచి రేటింగ్స్ ఉన్నాయి. 11,000 ల్యూమెన్స్ బ్రైట్‌నెస్, అద్భుతమైన కాంట్రాస్ట్ రేషియోతో వస్తుంది. మోనిటర్లతో పోటీ పడేలా కలర్స్ చాలా రిచ్‌గా కనిపిస్తాయి. ఇది నెట్ ఫ్లిక్స్& ప్రైమ్ వీడియో సర్టిఫైడ్ మోడల్. కాబట్టి ఓటీటీ యాప్స్ ఎక్కడా లాగ్ అవ్వకుండా స్మూత్‌గా రన్ అవుతాయి. దీని రొటేటబుల్ డిజైన్ వల్ల ప్రొజెక్టర్‌ను ఈజీగా తిప్పుకోవచ్చు.

4. Crossbeats Lumex Cine:

స్మార్ట్ వాచెస్, ఆడియో డివైసెస్ లో పేరున్న క్రాస్‌బీట్స్..హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలోనూ దూసుకుపోతోంది. ఇది 16,000 ల్యూమెన్స్ హై-బ్రైట్‌నెస్ , నేటివ్ 1080p డిస్‌ప్లేతో వస్తుంది. పెద్ద హాల్స్ లేదా రూమ్స్‌లో వాడుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్. దీని బిల్ట్-ఇన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ద్వారా యూట్యూబ్, హాట్‌స్టార్ వంటి యాప్స్‌ను డైరెక్ట్‌గా ప్లే చేయవచ్చు. దీని సౌండ్ అవుట్‌పుట్ కూడా మిగతా వాటికంటే కాస్త బెటర్‌గా ఉంటుంది.

Also Read: ఫ్రిజ్ లోపల ఏముందో ఫోన్లోనే చూసేయొచ్చు! ఈ స్మార్ట్ ఫ్రిజ్‌లను మించినవి లేవు

5. Zebronics Zeb-Pixaplay 65:

బడ్జెట్ ఫ్రెండ్లీ గేడ్జెట్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన జెబ్రోనిక్స్ నుండి వచ్చిన మోడ్రన్ స్మార్ట్ ప్రొజెక్టర్ ఇది. 10,000 ల్యూమెన్స్ బ్రైట్‌నెస్,200 ఇంచుల వరకు స్క్రీన్ సైజ్ సపోర్ట్ దీని సొంతం. బ్లూటూత్, వైఫై, హెచ్‌డీఎమ్‌ఐ వంటి అన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ఫోకస్, రూమ్ సైజ్‌కు తగ్గట్టుగా స్క్రీన్‌ను అడ్జస్ట్ చేసుకునే వీలుండటం దీని ప్లస్ పాయింట్. తక్కువ బడ్జెట్లో బ్రాండెడ్ ఆప్షన్ కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్.

బడ్జెట్ ప్రొజెక్టర్ కొనేటప్పుడు కేవలం “ల్యూమెన్స్” నంబర్స్ చూసి మోసపోకండి. ఎల్లప్పుడూ ‘Native Resolution’ 1080p ఉందో లేదో చెక్ చేసుకోండి. (కొన్ని బ్రాండ్లు 720p ఉంచి సపోర్ట్ 1080p అని రాస్తాయి). అలాగే.. బెస్ట్ హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసం ప్రొజెక్టర్‌తో పాటు ఒక మంచి బ్లూ టూత్ సౌండ్ బార్, వీలైతే ఒక వైట్/గ్రే ప్రొజెక్టర్ స్క్రీన్ వాడండి. ఇది పిక్చర్ క్వాలిటీని 40% వరకు పెంచుతుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×