E-Paper
Advertisement

New Chief Justices : తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు.. ఎవరంటే..?

New Chief Justices : తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు.. ఎవరంటే..?
Advertisement

New Chief Justices : తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు రాబోతున్నారు. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్ అరదే, ఆంధ్రప్రదేశ్ సీజేగా జస్టిస్‌ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.

జస్టిస్ అలోక్ అరదే మధ్యప్రదేశ్‌కు చెందిన వారు. 2009లో మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2018 నవంబర్ లో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అక్కడే కొనసాగుతున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుకు కేంద్ర ఆమోదం లభించగానే జస్టిస్ అలోక్ అరదే తెలంగాణ హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపడతారు.

Advertisement

జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జమ్మూకాశ్మీర్‌కు చెందిన వారు. 2013లో జమ్మూకాశ్మీర్ హైకోర్టులో జడ్జిగా నియమితులయ్యారు. 2022 జూన్‌ నుంచి బాంబే హైకోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ను మణిపూర్‌ హైకోర్టు ప్రధానమూర్తిగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. అయితే ఆ సిఫార్సు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. తాజాగా ఆ సిఫార్సును సుప్రీంకోర్టు కొలీజియం రద్దు చేసింది. తాజాగా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ పేరు సిఫార్సు చేసింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×