E-Paper
Advertisement

MAA association news: ‘మా’కు మంచు విష్ణు హ్యాండ్సప్!.. అందుకేనా?

MAA association news: ‘మా’కు మంచు విష్ణు హ్యాండ్సప్!.. అందుకేనా?
Advertisement
manchu vishnu chiranjeevi

Manchu Vishnu latest news(Today tollywood news):

ఒకసారి సీఎం కుర్చీలో కూర్చున్న నేత.. ఆ కుర్చీ దిగేందుకు అస్సలు ఇష్టపడరు. మళ్లీ మళ్లీ తానే ముఖ్యమంత్రి కావాలని పంతం పడుతుంటారు. సీఎం వరకూ ఎందుకు? ఎమ్మెల్యేలైనా అంతే. ప్రతీ ఐదేళ్లకు తానే గెలవాలని అనుకుంటారు. సర్పంచులు, వార్డు మెంబర్లైనా అంతే. రాజకీయ పదవులే కాదు.. ఏ కమిటీ అధ్యక్షులైనా ఓసారి పదవి రుచి మరిగితే.. అంత ఈజీగా వదిలిపెట్టలేరు. కానీ.. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అలా కాదు. ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌-MAA అధ్యక్ష పదవికి తాను పోటీ చేయనని తాజాగా జరిగిన సర్వ సభ్య సమావేశంలో ప్రకటించారు.

రెండేళ్లకోసారి జరుగుతాయి ‘మా’ ఎన్నికలు. గతసారి పోరు యమా రంజుగా సాగింది. ప్రకాశ్‌రాజ్ వర్సెస్ విష్ణు.. వార్ హోరాహోరీగా జరిగింది. ప్రకాశ్‌రాజ్‌కు మెగా ఫ్యామిలీ మద్దతుగా నిలవడంతో ఆయన గెలుపు చాలాఈజీ అనుకున్నారంతా. మంచు విష్ణు వెనకాల మోహన్‌బాబు పెదరాయుడిలా నిలిచారు. సైలెంట్‌గా ఆపరేషన్ కొనసాగించారు. మా లో ఓటు హక్కు ఉన్న సభ్యులను పర్సనల్‌గా కలిసి.. మనం మనం లోకల్ అంటూ సెంటిమెంట్ రాజేశారు. ప్రకాశ్ రాజ్‌ను పరాయి బూచీగా ప్రొజెక్ట్ చేశారు. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ వర్గం సైతం జగన్ బంధువైన మంచు విష్ణుకే అండర్‌కరెంట్‌గా సపోర్ట్ చేసింది. నందమూరి అభిమానులు సైతం మంచు వైపే నిలిచారు. బాలయ్య బాబును విష్ణు ప్రత్యేకంగా కలిసి మద్దతు కోరారు. కౌంటర్‌గా.. మెగా ఫ్యాన్స్ మంచు ఫ్యామిలీని ట్రోల్ చేయడం అప్పటి నుంచే ఎక్కువైంది. అవన్నీ ఎదుర్కొని.. టాలీవుడ్‌పై గట్టి పట్టున్న మెగా కుటుంబానికి షాక్ ఇస్తూ.. మోహన్‌బాబు సత్తా చాటారు. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలిచేశారు.

Advertisement

ఇదంతా రెండేళ్ల నాటి సంగతి. మళ్లీ ఎన్నికలు జరగాల్సిన సమయం వచ్చేసింది. అయితే, సెప్టెంబర్‌లో ఎలక్షన్ చేపట్టాల్సి ఉండగా.. ఆడిట్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే ఏడాది మే నెలకు ఎన్నిక వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఆ లోగా పెండింగ్ హామీలన్నీ కంప్లీట్ చేయాలని మా అధ్యక్షుడు మంచు విష్ణు డిసైడ్ అయ్యారట. మళ్లీ తాను పోటీ చేసేది లేదని.. అధ్యక్షుడిగా మంచి పేరు చిరకాలం నిలిచేలా పనులన్నీ పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు విష్ణు.

మరి, మంచు విష్ణు మళ్లీ ఎందుకు పోటీ చేయరు? అన్ని పనులు పూర్తి చేస్తే.. ఆ ఇమేజ్‌తో మరోసారి బరిలో దిగి.. గెలిచేయొచ్చుగా? అనే అనుమానం రాకమానదు. అయితే, ఈసారి గెలుపు అంత ఈజీ కాకపోవచ్చు. లాస్ట్ టైమ్.. ఓటర్ లిస్ట్ పట్టుకొని మరీ.. ఓటర్ టు ఓటర్ మోహన్‌బాబు క్యాంపెయిన్ చేస్తారని ప్రకాశ్‌రాజ్ టీమ్ ఊహించలేకపోయింది. అప్పట్లో పలు ఇంటర్వ్యూల్లో ప్రకాశ్‌రాజ్ చేసిన కామెంట్స్ సైతం ఆయనకు బాగా మైనస్ అయ్యాయి. ఈసారి కూడా మంచు విష్ణు పోరులో నిలిస్తే.. మెగా నెట్‌వర్క్ మరింత పక్కా క్యాండిడేట్‌ను, మరింత పకడ్బందీ క్యాంపెయిన్ చేస్తుంది. గెలుపును ఛాలెంజింగ్‌గా తీసుకుని పని చేస్తుంది. మా పదవితో మంచు కుటుంబానికి పెద్దగా ఒరిగేదేమీ లేదు. ఏదో ట్రై చేశామా..గెలిచేశామా..రెండేళ్లు ఎంజాయ్ చేశామా. అంతే. మళ్లీ మళ్లీ ఆ తలనొప్పి తమకెందుకనే భావనలో ఉంది మంచు ఫ్యామిలీ. అసలే, అన్నదమ్ముల గొడవలతో వాళ్ల ప్రాబ్లమ్స్ వాళ్లకున్నాయ్. మళ్లీ మా రాజకీయం ఎందుకని ఈసారి సైలెంట్‌గా సైడ్ అవ్వనున్నారు మంచు విష్ణు..అని అంటున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×