E-Paper
Advertisement

KCR: నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు, పాలు-నీళ్లు ఏవో జనాలకు అర్థమైంది: కేసీఆర్

KCR: నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు, పాలు-నీళ్లు ఏవో జనాలకు అర్థమైంది: కేసీఆర్
Advertisement

KCR: పంచాయతీ ఫలతాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెప్పారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గం సమావేశం జరిగింది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులతో కేసీఆర్ సమావేశమయ్యారు. సుమారు పది నెలల సుదీర్ఘ విరామం తర్వాత పార్టీ కార్యాలయానికి వచ్చిన కేసీఆర్ కు కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ భేటీలో కేసీఆర్ మాట్లాడుతూ… పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత స్పష్టమైందన్నారు. తనను దూషించడం, చనిపోవాలని శాపాలు పెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఏవి పాలో, ఏవి నీళ్లో అర్థమైందన్నారు.

ఆస్తుల విలువ తగ్గిపోయింది

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని, తనపై వ్యక్తిగత విమర్శలు చేయడానికే సమయం ఇస్తోందని ఆక్షేపించారు. పార్టీ గుర్తులతో ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎస్‌ సత్తా తెలిసేదన్నారు. గర్వంతో మాట్లాడే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ అహంకార వైఖరి ప్రదర్శించలేదని చెప్పుకొచ్చారు. రెండేళ్లలో కాంగ్రెస్‌ ఒక్క కొత్త పాలసీ కూడా తేలేదన్నారు. కాంగ్రెస్ పాలసీ రియల్‌ ఎస్టేట్‌ కోసమే అన్నారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిందని ఆరోపించారు. ఒకప్పుడు యూరియా ఇంటికి వచ్చేదని, ఇప్పుడు ఇంటిళ్లపాది లైన్లలో నిలబాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

నీటి వాటాలపై

Advertisement

తెలంగాణ సాగునీటి హక్కుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును కేసీఆర్ తప్పుబట్టారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటాపై కాంగ్రెస్ సర్కార్ దిల్లీలో మోకరిల్లిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి కీలక ప్రాజెక్టు విషయంలో నీటి వాటాలపై రాజీపడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తది ఒక్క పథకం కూడా తీసుకురాలేదన్నారు.

Also Read: Kalvakuntla Kavitha: ప్రజా సమస్యల కోసమే జాగృతి జనం బాట: కవిత

బహిరంగ సభలకు రెడీ అవ్వండి

Advertisement

నీటి హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ మరోసారి జల ఉద్యమానికి సిద్ధమవుతోందని కేసీఆర్ తెలిపారు. ఇందుకోసం ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో త్వరలోనే భారీ బహిరంగ సభలకు కార్యాచరణ సిద్ధం చేయాలని నేతలకు సూచించారు. అలాగే పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు గ్రామ కమిటీల నుంచి రాష్ట్ర స్థాయి వరకు నియామకాలు చేపట్టాలన్నారు. వాయిదా పడుతూ వస్తున్న బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాబోయే ఎన్నికలకు పార్టీ శ్రేణులన్నీ సిద్ధమవ్వాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×