E-Paper
Advertisement

Jagga Reddy: కేసీఆర్ కుటుంబం తాగుతున్నది కాంగ్రెస్ కట్టిన మంజీరా నీళ్లే.. అధికారం పోగానే ఆంధ్రా పగ గుర్తుకొచ్చిందా?: జగ్గారెడ్డి ఫైర్

Jagga Reddy: కేసీఆర్ కుటుంబం తాగుతున్నది కాంగ్రెస్ కట్టిన మంజీరా నీళ్లే.. అధికారం పోగానే ఆంధ్రా పగ గుర్తుకొచ్చిందా?: జగ్గారెడ్డి ఫైర్
Advertisement

Jagga Reddy: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి గాంధీ భవన్‌లో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది నూటికి నూరుపాళ్లు సరైనదేనని స్పష్టం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతా తప్పుల తడక అని, ఇరిగేషన్ గురించి ఆయనకు మాత్రమే తెలివి ఉన్నట్లు బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ నీళ్లే దిక్కు:

కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి కాళేశ్వరం కట్టిన తర్వాతే జనం నీళ్లు తాగుతున్నట్లు బీఆర్ఎస్ నేతలు చెప్పుకోవడం హాస్యాస్పదమని జగ్గారెడ్డి అన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత నాగార్జున సాగర్, శ్రీశైలం వంటి భారీ ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తుచేశారు. “హైదరాబాద్‌లో ఉంటున్న కేసీఆర్ కుటుంబం ఇన్నాళ్లు కాంగ్రెస్ కట్టిన మంజీరా డ్యామ్ నీళ్లు తాగలేదా? ఆ నీళ్లు తాగి పెరిగే ఇప్పుడు కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారా?” అని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్ హయాంలో ఉచిత విద్యుత్ వల్లే తెలంగాణలో బోరు బావుల కింద సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు.

అవసరానికి ఆంధ్రా సెంటిమెంట్:

Advertisement

అధికారం పోగానే బీఆర్ఎస్ నేతలకు మళ్లీ ఆంధ్రా వ్యతిరేకత గుర్తుకొచ్చిందని జగ్గారెడ్డి విమర్శించారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు, కేసీఆర్ చంద్రబాబుతో ఉన్నప్పుడు ఆంధ్రా పగ గుర్తుకు రాలేదా అని నిలదీశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. సలహాలు ఇవ్వాల్సిన ప్రతిపక్షం “తోలు తీస్తాం” అని మాట్లాడితే, తమ వాళ్ళు “నాలుకలు కోస్తాం” అని కౌంటర్ ఇచ్చారని సమర్థించుకున్నారు.

2017లో సంగారెడ్డిలో రాహుల్ గాంధీతో తాను నిర్వహించిన భారీ సభను చూసి కేసీఆర్ భయపడ్డారని, అందుకే తనపై అక్రమ కేసులు బనాయించి వేధించారని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తెచ్చింది, ఇప్పుడు కాపాడేది కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. ఇక ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీకి అధికారం లేదు కాబట్టి, తెలంగాణలో ఆ పార్టీకి చెప్పుకోవడానికి ఏమీ లేదని కొట్టిపారేశారు.

Advertisement

Read Also: కేసీఆర్ చావు కోరుకునేది కేటీఆర్, హరీష్ రావులే.. రేవంత్ కాదు: ఎంపీ చామల ఫైర్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×