// // Portronics Pico 14 Projector: జేబుల్లో పట్టేంత మినీ ప్రొజెక్టర్ ఇది! -->
E-Paper
Advertisement

Portronics Pico 14 Projector: వచ్చేసింది మినీ ప్రొజెక్టర్.. జేబులో పట్టేంత ఈ బుజ్జి గ్యాడ్జెట్ 100 అంగుళాల టీవీతో సమానం!

Portronics Pico 14 Projector: వచ్చేసింది మినీ ప్రొజెక్టర్.. జేబులో పట్టేంత ఈ బుజ్జి గ్యాడ్జెట్ 100 అంగుళాల టీవీతో సమానం!
Advertisement

Portronics Pico 14 Projector: రోజు రోజుకు అభివద్ధి ఈ టెక్నాలజీ యుగంలో సినిమా చూడాలంటే థియేటర్లకే వెళ్లాల్సిన అవసరం లేదు. భవిష్యత్ టెక్నాలజీని అందుకునేలా సరికొత్త గ్యాడ్జెట్‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా విడుదలైన ఓ బుజ్జి ప్రొజెక్టర్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ ప్రొజెక్టర్ మీద వద్ద ఉంటే థియేటర్లకు వెళ్లేపని లేదిక. దీనిని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకొళ్లొచ్చు. ఈ మినీ ప్రొజెక్టర్ 100 అంగుళాల టీవీతో సమానం అంటోంది దీని తయారుదారు సంస్థ. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జేబులో పట్టేంత సైజు:

పెద్ద స్క్రీన్‌లో టీవీ చూడాలి అనిపించినప్పుడల్లా.. ఇక థియేటర్లతో పని లేకుండా, ఎక్కడికి వెళ్లినా తీసుకెళ్లేలా ఉన్న మినీ ప్రొజెక్టర్ గురించే ఇప్పుడు చర్చంతా. ప్రముఖ పోర్ట్రోనిక్స్ సంస్థ విక్రయిస్తోన్న.. ‘పోర్ట్రానిక్స్ పికో 14 ప్రొజెక్టర్’ 100 అంగుళాల స్క్రీన్‌పై ప్రొజెక్ట్ చేయగలదు.

కరెంట్‌తో పనిలేదు:

Advertisement

ఈ ప్రొజెక్టర్ అంతర్నిర్మిత బ్యాటరీ, స్పీకర్లతో లభిస్తుంది. దీని అర్థం ఏమిటంటే.. ఈ ప్రొజెక్టర్‌ను ఉపయోగించడానికి ఎలాంటి విద్యుత్ అవసరం లేదన్న మాట. అలాగే ఇది స్పీకర్‌గా కూడా పనిచేస్తుంది. ఈ మినీ ప్రొజెక్టర్ ఆండ్రాయిడ్ 13పై నడుస్తుంది. అలాగే డ్యూయల్-బ్యాండ్ Wi-Fi తో వస్తుంది. ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ వివిధ రకాల OTT ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్‌ను కూడా అందిస్తుందని కంపెనీ తెలిపింది.

చీకటి గదిలోనే వాడాలి:

ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ రిమోట్ కంట్రోల్‌తో లభిస్తుంది. 250 గ్రాముల బరువు, 60mm ఎత్తు, 73mm వెడల్పు కలిగి ఉన్న ఈ ప్రొజెక్టర్ మన జేబులో సరిపోయే పరిమాణంలో ఉంటుంది. అలాగే దీనికి 1600 ల్యూమెన్ల పవర్ అవుట్‌పుట్‌ ఉంటుంది. అయితే ఈ ప్రొజెక్టర్‌ను చీకటి గదిలో ప్రొజెక్ట్ చేయాలి. ప్రకాశవంతమైన ప్రదేశంలో ఉపయోగించకూడదు.

ధర ఎంతంటే?

Advertisement

చూడటానికి చిన్న పరిమాణంలో ఉన్న ఈ మినీ ప్రొజెక్టర్.. ఎక్కడికి వెళ్లినా మనతో పాటు తీసుకెళ్లే ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇక పోర్ట్రానిక్స్ పికో 14 ప్రొజెక్టర్ ధర విషయానికి వస్తే.. ఇది కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ.28,349 ధరకు అందుబాటులో ఉంది. అయితే, దీనిని ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో రూ.25,599కే కొనుగోలు చేయవచ్చు. మరెందుకు ఆలస్యం మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసేయండి మరి.

 

 

 

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×